Mega Job Fair: బొబ్బిలిలో మెగా జాబ్ మేళా.. తేదీ ఇదే..
Sakshi Education
బొబ్బిలి: ఏపీ స్టేట్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న బొబ్బిలిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ప్లేస్‌మెంట్స్ జిల్లా అధికారి టి.భాస్కర్ డిసెంబర్ 5న ఒక ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, బీటెక్, ఐటీఐ తదితర కోర్సులు చదివిన నిరుద్యోగులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 13 మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు హాజరై వివిధ ఉద్యోగాలకు యువతను ఎంపిక చేస్తారన్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని బొబ్బిలిలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు అన్ని ధ్రువపత్రాలు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్: 79898 26953, 87905 00572, 99888 53335 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Published date : 07 Dec 2023 08:18AM