Skip to main content

Job Mela: టెన్త్‌ అర్హతతో ఉద్యోగం.. రేపే జాబ్‌మేళా

Job Mela

తుక్కుగూడ: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు ఈ నెల 24న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి జయశ్రీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

National Scholarships: నేషనల్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, బీఫార్మసీ కోర్సులు చేసిన వారికి నగరంలోని రిటైల్‌, ఈ–కామర్స్‌, బీపీఓ రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 9063099306 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
 

Published date : 23 Aug 2024 05:11PM

Photo Stories