ఎంఎన్సీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో 1500 ఖాళీల భర్తీకి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉద్యోగాలకు 2022, 2023, 2024 సంవత్సరాల్లో బీటెక్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో హెచ్ఆర్, టెక్నికల్ రౌండ్లు ఉంటాయన్నారు.
ఉద్యోగాలు హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో రొటేషన్ షిప్టుల్లో అందుబాటులో ఉంటాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఆసక్తి గల యువత హెచ్‌టీటీపీఎస్://బిట్.ఎల్వై/46డబ్ల్యూజెడ్క్యూజెడ్6 లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, స్థలాన్ని తెలియజేస్తామన్నారు. సమాచారం, సందేహాలకు సెల్: 63012 75511, 94947 77553 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.