Skip to main content

Job Interview : డిగ్రీ క‌ళాశాల‌లో ఇంట‌ర్వ్యూలు.. ఈ తేదీకే..!

Job interview at SVS Government degree college on August 28

తిరుపతి: సూళ్లూరుపేటలోని ఎస్‌వీఎస్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న బ్లూస్టార్‌ కైమేటిక్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఆర్‌.లోకనాథం తెలిపారు. ఐటీఐ, డిప్లొమో, బీటెక్‌ ఉత్తీర్ణులై, 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు.

Jobs In Medical College: మెడికల్‌ కాలేజీలో వివిధ పోస్టుల భర్తీ.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో నియామకం

పదో తరగతి, డిగ్రీ చదువుకున్న 18–30 ఏళ్లలోపు వారు ప్రొడక్షన్‌ హెల్పర్లుగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఆసక్తి గలవారు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Published date : 24 Aug 2024 01:21PM

Photo Stories