Job Mela: ఈనెల 30న జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు
Sakshi Education
నిజామాబాద్: 2023 – 24 విద్య సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం హెచ్‌సీఎల్ టెక్ బీ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్, కంపెనీ ప్రతినిధి ఆర్ రాజేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Jobs In Medical College: మెడికల్ కాలేజీలో వివిధ పోస్టుల భర్తీ.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో నియామకం
ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న జాబ్‌మేళాకు వొకేషనల్ గ్రూపుల విద్యార్థులు, సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో 75శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం 80740 65803, 97016 65424 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Published date : 24 Aug 2024 03:01PM