Skip to main content

Mega Job Mela: వికాసలో జాబ్‌మేళా

కాకినాడ సిటీ: కాకినాడ వికాస కార్యాలయంలో ఈనెల 7న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ కె లచ్చారావు ఆగ‌స్టు 4న‌ తెలిపారు.
Mega Job Mela
వికాసలో జాబ్‌మేళా

రిలయన్స్‌ ట్రెండ్స్‌లో రిటైల్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, అల్బర్టా ఇంటర్‌నేషన్‌ ఐ హాస్పటల్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌, శ్రీ సత్యమూర్తి హాస్పటల్‌లో కో ఆర్డినేటర్‌, రిసెప్షనిస్ట్‌, పబ్లిక్‌ రిలేషన్‌షిప్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌, నిట్‌ (ఐసీఐసీఐ) బ్యాంక్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌, డెక్కన్‌ కెమికల్స్‌ కంపెనీలో ట్రైనీ, ఇసుజు మోటర్స్‌, డిక్సాన్‌ అండ్‌ హోండాయ్‌ మోబీస్‌ కంపెనీల్లో టెక్నిషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు.

చదవండి: Telangana Jobs 2023: తెలంగాణలో 1520 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

డీడీయుజికైవె స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ట్రైనింగ్‌ ఇచ్చి ఉద్యోగం కల్పించనున్నారు. పై ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, ఐటిఐ, డిప్లామో, డిగ్రీ, బిటెక్‌, ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు.

చదవండి: 1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్‌–సి హోదాలో కేంద్ర కొలువులు

వీరికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 25 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్‌, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 7న కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్స్‌ జెరాక్స్‌లతో హాజరు కావచ్చని పీడీ వివరించారు.

Published date : 05 Aug 2023 03:14PM

Photo Stories