Job Mela: శ్రీకాకుళంలో జాబ్ మేళా
నోడల్ రిసోర్స్ సెంటర్, జవహర్ నాలెడ్జ్ సెంటర్, కెమిస్ట్రీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్‌మేళాలో హెటెరో ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా సిటికల్ కంపెనీలో ట్రైనీ కెమిస్ట్ (ప్రొడక్షన్ క్యూసీ, ప్రొడక్షన్ క్యూఏ) ఉద్యోగాల భర్తీ కొరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థులు 27 ఏళ్లలోపు వయస్సు కలిగి ఎమ్మెస్సీ ఆర్గానిక్/ఇన్ ఆర్గానిక్/అనలేటికల్ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ ఉత్తర్ణులైన పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు.
చదవండి: Job Fair: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
ఎంపికై నవారికి మంచి జీతంతోపాటు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, మెడిక్లెయిమ్స్, రిటెన్షన్ బోనస్, సబ్సిడైజ్డ్ ఫుడ్, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు గురువారం ఉదయం కళాశాల జేకేసీ కేంద్రానికి తమ విద్యార్హ్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, రెండు ఫొటోలతో ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ సురేఖ కోరారు. మరిన్ని వివరాలకు 9441387184, 9949094968, 8143277610 నంబర్లను సంప్రదించాలని ఆమె సూచించారు.