Job Fair: ఉపాధి కల్పనా కార్యాలయం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.. వీటిని తప్పక తీసుకురావాలి
Sakshi Education
ఒంగోలు సెంట్రల్: జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ఆధ్వర్యంలో యాక్సిస్ బ్యాంక్, క్వార్‌ట్ట్‌జ్ క్రాప్ట్ కంపెనీలలో పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి మార్చి 14న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టీ భరద్వాజ తెలిపారు.

బిజినెస్ డెవప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, మెషిన్ ఆపరేటర్ సెక్టార్‌లలో వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఇంటర్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, బి.టెక్ పూర్తి చేసిన వారు ఇంటర్యూకు హాజరు కావాలని కోరారు.
చదవండి: Mega Job Mela: నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆధార్ కార్డు, సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను తీసుకురావాలని చెప్పారు. పూర్తి వివరాలకు ఆఫీస్ సమయాల్లో 08592281776ను సంప్రదించాలని కోరారు.
Published date : 12 Mar 2024 04:17PM