Skip to main content

Job Mela: జాబ్‌మేళా ద్వారా నిరుద్యోగులకు ఉపాధి

మడకశిర: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి అబ్దుల్‌ ఖయూమ్‌ తెలిపారు.
District Skill Development Officer Abdul Qayoum addressing the audience in Madakasira   Employment of the unemployed through Job Mela   Government's goal

పట్టణంలోని ఎస్‌వైటీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జ‌నవ‌రి 12న‌ ఆయన జిల్లా స్థాయి మెగా జాబ్‌మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి శిక్షణ నిమిత్తం ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.

చదవండి: Medical Health Department: ఆన్‌లైన్‌లో అభ్యర్థుల ప్రొవిజనల్‌ వెరిఫికేషన్‌ జాబితా

జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా జాబ్‌మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. మడకశిరలో జరిగిన జిల్లా స్థాయి మెగా జాబ్‌ మేళాలో 11 కంపెనీలు పాల్గొన్నాయన్నారు. 266 మంది నిరుద్యోగులకు హాజరుకాగా 103 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తెలిపారు.

Published date : 13 Jan 2024 04:25PM

Photo Stories