Medical Health Department: ఆన్‌లైన్‌లో అభ్యర్థుల ప్రొవిజనల్ వెరిఫికేషన్ జాబితా
Sakshi Education
మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పాడేరు)లో గల వివిధ ఖాళీళీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తుల పరిశీలన పూర్తి అయింది.
దీంతో అభ్యర్థుల ప్రొవిజినల్ వెరిఫికేషన్ జాబితాను ఎన్‌ఐసీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల సంచాలకులు డాక్టర్ డి.హేమలత తెలిపారు. ఇందుకు సంబంధించి అభ్యంతరాలను జనవరి 17 నుంచి 18వ తేదీ సాయంత్రం 5గంటల వరకు స్వీకరిస్తున్నట్టు తెలిపారు.
చదవండి: Unemployed: నిరుద్యోగుల కోసం ఆన్‌లైన్ సేవా పోర్టల్
అభ్యర్థులు తమ అభ్యంతరాలను నేరుగా గాని లేదా మెయిల్ ఐడీః recruitmentgmc paderu@gmail.com ద్వారా గాని తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రొవిజనల్ మెరిట్ జాబితా పొందుపరుస్తారని తెలిపారు. మెరిట్ జాబితా రోస్టర్ ఆధారంగా మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
Published date : 13 Jan 2024 04:31PM