Skip to main content

Unemployed: నిరుద్యోగుల కోసం ఆన్‌లైన్‌ సేవా పోర్టల్‌

Online Service Portal for Unemployed    JC Narapureddy Maurya promoting online job services

కర్నూలు(సెంట్రల్‌): ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సేవా పోర్టల్‌ సర్వీసులను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ నారపురెడ్డి మౌర్య కోరారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో ఉపాధి, శిక్షణ శాఖకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవా పోర్టల్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజీలు, మోడల్‌ కెరీర్‌ సెంటర్ల అందించు సేవలను భారత ప్రభుత్వ నేషనల్‌కెరీర్‌ సర్వీసు(ఎన్‌సీఎస్‌)తో అనుసంధానించినట్లు చెప్పారు. తద్వారా ఎంప్లాయిమెంట్‌రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌, అదనపు అర్హతలు నమోదు తదితర సేవలను సులభరీతిలో www.employment.ap.gov.in ను సందర్శించి పొందేందుకు వీలు ఉంటున్నారు. కార్యక్రమంలోజిల్లా ఉపాధి అధికారి పి.దీప్తి, సిబ్బంది నరసింహులు, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

చదవండి: Job opportunities: శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు

Published date : 13 Jan 2024 03:24PM

Photo Stories