YS Avinash Reddy: ఆర్టీపీపీలో ఉద్యోగాలిప్పిస్తామంటే నమ్మవద్దు
Sakshi Education
పులివెందుల రూరల్: జమ్మలమడుగు నియోజకవర్గంలోని థర్మల్ ఆర్టీపీపీలో ఉద్యోగాలిప్పిస్తామని కొందరు చెప్పే అవాస్తవాలను నమ్మవద్దని కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి ప్రజలకు సూచించారు.
పులివెందులలో జరిగిన ప్రజాదర్భార్‌లో జిల్లా నలుమూలల నుంచి తమకు ఉద్యోగం ఇప్పించాలంటూ కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన స్పందిస్తూ ధర్మల్ ఆర్టీపీపీలో ఎలాంటి ఉద్యోగాలు లేవని, ఎమ్మెల్యే కోటా కింద, ఎంపీ కోటా కింద ఉద్యోగ అవకాశాలున్నాయని కొందరు మాయమాటలు చెప్తున్నారన్నారు. ఎవరో చెప్పే అవాస్తవాలను నమ్మి మోసపోవద్దన్నారు.
చదవండి:
Govind Nayak: నకిలీ సర్టిఫికెట్లపై అప్రమత్తంగా ఉండాలి
Fake Certificates Case: కాళోజీ వర్సిటీ నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఒకరి అరెస్టు
Published date : 20 Oct 2023 01:21PM