Govind Nayak: నకిలీ సర్టిఫికెట్లపై అప్రమత్తంగా ఉండాలి
అక్టోబర్ 19న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లతో అనంతపురం నగరంలోని కేఎస్‌ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన బోర్డు జారీ చేసిన పదోతరగతి, ఇంటర్ సర్టిఫికెట్లతో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి పొందిన 50 ఎస్‌ఎస్‌సీ బోర్డులు, 51 ఇంటర్ బోర్డులు జారీ చేసిన పదోతరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు మాత్రమే మన రాష్ట్రంలో చెల్లుబాటు అవుతాయన్నారు.
చదవండి: Fake Certificates Case: కాళోజీ వర్సిటీ నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఒకరి అరెస్టు
నకిలీ సర్టిఫికెట్ల విషయంలో ఎలాంటి ప్రమేయం ఉన్నా కఠన చర్యలు తప్పవని కోఆర్డినేటర్లను హెచ్చరించారు. ఈ సందర్భంగా అందరి కోఆర్డినేటర్లతో స్వీయ ధ్రువీకరణపత్రాలు తీసుకున్నారు. సమావేశంలో శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ లాజర్, ఉమ్మడి జిల్లాల డీవైఈఓలు పద్మప్రియ, రంగస్వామి, అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.