10 Member MPs Committee: రాజ్యసభ నుంచి జేఎన్‌యూ కోర్టుకు కె.లక్ష్మణ్
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కోర్టుకు తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ నామినేట్ అయ్యారు.
అలాగే, మధ్యప్రదేశ్‌కు చెందిన సుమేర్‌సింగ్ సోలంకి, మహారాష్ట్రకు చెందిన సుఖ్‌దేవ్ రావ్ బోండేలను కూడా నామినేట్ చేస్తూ.. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: NIRF 2024 Rankings: అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. విభాగాల వారీగా ర్యాంకులు ఇలా..
వార్షిక నివేదికలు, వార్షిక ఖాతాలు, ఆడిట్ రిపోర్టులు, జేఎన్‌యూ వార్షిక బడ్జెట్‌పై చర్చించేందుకు, పరిశీలించేందుకు వైస్‌చాన్స్‌లర్ అధ్యక్షతన ప్రతీ ఏటా ఈ కోర్టు సమావేశమవుతుంది. అలాగే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకడమిక్ కౌన్సిల్ చర్యలను సమీక్షించే అధికారాలు కూడా ఈ కోర్టుకు ఉంటాయి.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేసిన ఆరుగురు ఎంపీలు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన నలుగురు ఎంపీలు.. మొత్తం 10మంది ఎంపీలు ఈ కోర్టులో సభ్యులుగా ఉంటారు.
Published date : 20 Nov 2024 01:19PM