Fake Certificates Case: కాళోజీ వర్సిటీ నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఒకరి అరెస్టు
Sakshi Education
రామన్నపేట : కాళోజీ ఆరోగ్య వర్సిటీలో లోకల్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందిన కేసులో అక్టోబర్ 5న ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ నకిలీ వ్యవహారంపై సెప్టెంబర్ 29న పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లింది.
చదవండి: KNRUHS: ఈ కోటా ఎంబీబీఎస్ సీట్లలో ఇతరులకూ అవకాశం
నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసిన కన్సల్టెంట్ నిర్వాహకుడు నాగేశ్వర్‌రావు, అతని అనుచరుడు విజయ్‌భాస్కర్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో బాపట్ల జిల్లా వేదులపల్లి గ్రామానికి చెందిన విజయ్‌భాస్కర్ పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరులో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. కన్సల్టెంట్ నిర్వాహకుడు నాగేశ్వర్‌రావు ఇంకా పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు.
Published date : 06 Oct 2023 04:09PM