NEET PG కటాఫ్ స్కోర్ జీరో పర్సంటైల్‌కు కుదింపు
ఇదివరకు కేటగిరీల వారీగా కటాఫ్ ఉండగా... ఇప్పుడు జీరో పర్సంటైల్‌కు కటాఫ్ స్కోరును కుదించింది. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులే. తాజాగా కటాఫ్ స్కోరు తగ్గించడంతో పీజీ ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ మరో రౌండ్‌కు కౌన్సెలింగ్ నిర్వ హిస్తున్నట్లు ప్రకటించింది.
చదవండి: NEET Seats 2023 : నీట్‌లో జీరో మార్కులు వచ్చిన కూడా సీటు.. ఎలా అంటే.. ఇలా..?
ఇందులో భాగంగా అభ్యర్థులకు సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అభ్యర్థులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను వర్సిటీ ప్రకటిస్తుంది. అర్హత ఇతర వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని యూనివర్సిటీ ప్రకటనలో వెల్లడించింది.