Private Company: ఉద్యోగం పేరుతో రూ.1.50 లక్షలు టోకరా
వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన నందిగామ శ్రుతికి ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ బాధ్యులమని చెప్పి కొందరు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. స్థానిక మండలంలోనే ఉద్యోగమని, నెలకు రూ.16,500 వేతనం అని తెలిపారు. అందుకు ఆమె వద్ద నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నారు. నేలకొండపల్లి డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి మొక్కల గురించి వివరించడం ఆమె విధి. రెండు నెలలు చేసింది. కానీ, ఒక్క రూపాయి వేతనం కూడా ఇవ్వలేదు.
బాధిత యువతి వేతనం కోసం ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. చివరికి తాను ఉద్యోగం చేయలేనని, తాను చెల్లించిన డబ్బులు ఇవ్వమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారని వాపోయింది. తన కుటుంబంలో తల్లి లేదని, తండ్రి, తాను కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఉద్యోగం కోసం తెచ్చిన అప్పులు వడ్డీలకువడ్డీలు పెరిగిపోతున్నాయని కన్నీటి పర్యంతమైంది. ఖమ్మం పోలీసులకు సామాజిక కార్యకర్త పసుమర్తి శ్రీనివాస్‌తో కలిసి గురువారం ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు తెలిపింది.
చదవండి: SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..