తెలంగాణ మహిళా వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా విజ్జులత
అనంతరం ఆమె విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండేలా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కృషి చేయాలని ఆకాంక్షించారు.
చదవండి: TS Government Jobs : విద్యాశాఖలో 20 వేల పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
విజ్జులత నియామకం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ వర్సిటీ అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా సబిత గుర్తుచేశారు.
చదవండి: High Court: విద్యాశాఖ కమిషనర్ ప్రొసీడింగ్స్ అమలు నిలుపుదల
వర్సిటీ అవసరాలు, ఇతర పరిస్థితులకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రికి సూచించారు. బోధనా సౌకర్యాలు, విద్యారి్థనులకు కావా ల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ రవీందర్ యాదవ్ తదితరులున్నారు.
చదవండి: Engineering: ‘బీ’ కేటగిరీ సీట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ