Skip to main content

Engineering: ‘బీ’ కేటగిరీ సీట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ

ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ‘బీ’కేటగిరీ సీట్ల భర్తీకి ఉన్నత తెలంగాణ విద్యా మండలి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.
Engineering
‘బీ’ కేటగిరీ సీట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ

అక్టోబర్‌ 15లోగా ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలను ఆదేశించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆమోదం తెలిపిన ఇంజనీరింగ్‌ సీట్లు 1,11,558 (మైనార్టీ కాలేజీలు సహా) ఉండగా, ఇందులో 30 శాతం సీట్లు ‘బీ’కేటగిరీ (15 శాతం ఎన్ ఆర్‌ఐ, 15 శాతం నాన్ –ఎన్ ఆర్‌ఐ) కింద భర్తీ చేస్తారు. అంటే దాదాపు 36 వేల సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కిందకొస్తాయి. ఈ సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. ఇదిలాఉండగా, మెరిట్‌ ప్రకారమే వీటిని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ రాకముందే కాలేజీలు సీట్లన్నీ అమ్ముకుని సొమ్ముచేసుకున్నాయనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఎప్పటిలాగా నామమాత్రపు ప్రకటన వెలువరించారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

నిబంధనలెక్కడ?

‘బీ’కేటగిరీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి స్పష్టమైన మార్గదర్శకాలు ఇ చ్చింది. ఆయా కాలేజీలు మూడు దినపత్రికల్లో ఎన్ని సీట్లు ఉన్నాయనేది స్పష్టంగా తెలియజేయాలి. ప్రతీ విద్యార్థి దరఖాస్తును తీసుకోవాలి. జేఈఈ ర్యాంకు అభ్యర్థులకు ముందుగా సీట్లు కేటాయించాలి. ఆ తర్వాత ఎంసెట్‌ ర్యాంకును కొలమానంగా తీసుకోవాలి. ఇంకా సీట్లు మిగిలితే ఇంటర్‌ మార్కుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. మెరిట్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసినా, ఏదో కారణంతో సీట్లు కేటాయించడం లేదు. అంతిమంగా వారు ఎవరికి సీట్లు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లకే ఇస్తున్నారు. ఫార్మసీ కాలేజీల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. ఈ విభాగంలో దాదాపు 9 వేల సీట్లున్నాయి. వీటిలో 4,500 సీట్లకు మాత్రమే అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతి ఉంది. మిగతావన్నీ ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి మాత్రమే తీసుకున్నాయి. అయినప్పటికీ ఇష్టానుసారం సీట్లు అమ్ముతున్నారు.

టీఏఎఫ్‌ఆర్‌సీ మాట నిలబెట్టుకోవాలి

మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ అడ్మిషన్లు, ఫీజు నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ప్రకటన చేసింది. ప్రైవేటు కాలేజీలు ‘బీ’కేటగిరీ కింద దరఖాస్తు తీసుకోకపోతే తమకు ఇవ్వాలని, కమిటీనే నిబంధనలు అమలయ్యేలా చూసుకుంటుందని తెలిపింది. అయితే ఆచరణలో ఇది అమలయ్యేలా చూడాలి. ఇప్పటికే సీట్లు అమ్ముకున్నారనే బలమైన ఆరోపణలున్న నేపథ్యంలో కమిటీ కీలకపాత్ర పోషించి, విశ్వసనీయత కలిగించాలి.

-డీవీ బాలకృష్ణారెడ్డి, టెక్నికల్, ప్రొఫెషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
చదవండి:

Engineering: కన్వీనర్ కోటాలో 70వేలకు పైగా సీట్లు...ఆప్షన్ల నమోదుకు చివరి తేదీ ఇదే…

New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం

Published date : 17 Sep 2021 03:31PM

Photo Stories