Skip to main content

TSCHE: ఒక క్లిక్‌.. నకిలీ సర్టిఫికెట్లకు చెక్‌!

సాక్షి, హైదరాబాద్ః నకిలీ విద్యార్హతల ధ్రువపత్రాలకు ఇక చెక్‌ పడనుంది. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది.

ఇది నవంబర్‌ 18 నుంచి అందుబాటులోకి రానుంది. తెలంగాణ వ్యాప్తంగా 15 విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థుల వివరాలు ఇందులో లభిస్తాయి. ఉపాధి కల్పించే సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు.. కేవలం ఒక్క క్లిక్‌తో ఆ ధ్రువపత్రం నిజమైందా? నకిలీదా? తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకూ యూనివర్శిటీలకు విద్యార్థి సర్టిఫికెట్లు పంపడం, వాటిని అవి పరిశీలించి నిర్థారించడం రివాజుగా సాగుతోంది. దీనివల్ల ధ్రువీకరణలో జాప్యం జరుగుతోంది. మరోవైపు నకిలీ సర్టిఫికెట్ల ముఠా యథేచ్ఛగా దందా కొనసాగిస్తోంది.

చదవండి: Fake Notification: పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వలేదు

విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్లు, రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునే వాళ్లలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లనే ఆశ్రయిస్తున్నారన్న వాదన ఉంది. సర్టిఫికెట్లను బట్టి రూ.వేలు, లక్షల్లో డబ్బులు తీసుకుని అభ్యర్థులు కోరుకునేంత మెరిట్‌తో సర్టిఫికెట్లను తయారు చేసి ఇచ్చే ముఠాలకు కొదవ లేకుండా పోయింది. దాంతో కష్టపడి చదివిన పట్టాలు పొందిన విద్యార్థులకు నష్టం కలు గుతోంది. దీన్ని అడ్డుకోవడానికి కంపెనీలు, వర్సిటీలు నేరుగా తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. 

చదవండి: Fake Advertisement: ఆ ప్రచారాన్ని నమ్మవద్దు.. నిరుద్యోగులకు సూచన..
రాష్ట్రంలోని 2010 సంవత్సరం నుంచి 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థుల హాల్‌ టికెట్‌ నెంబర్లను వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేస్తే సర్టిఫికెట్‌ అసలుదో.. నకిలీదో తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ సహా పలువిదేశీ భాషలలో కూడా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. 

చదవండి: Fake Website: ఫేక్‌ వెబ్‌సైట్‌తో ఫీజు వసూలు

రేపు వెబ్‌సైట్‌ ప్రారంభం:

ఉన్నత విద్యామండలి రూపొందించిన వెబ్‌సైట్‌ను న‌వంబ‌ర్ 19 న‌ విద్యాశాఖ మంత్రి సబిత ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయష్‌ రంజన్‌ హాజరుకానున్నారు. 

చదవండి: TTD: సోషల్‌ మీడియా ఉద్యోగ ప్రకటనలు నమ్మొద్దు

Published date : 17 Nov 2022 02:15PM

Photo Stories