District Education Officer: విద్యార్థులతో సైన్స్ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయండి
Sakshi Education
నంద్యాల(న్యూటౌన్): ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులతో సైన్స్ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుధాకర్‌రెడ్డి చెప్పారు. బుధవారం నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. సైంటిస్ట్‌లను తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు తప్పకుండా ఐదు నామినేషన్లను రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు.
Published date : 10 Aug 2023 07:12PM