Teachers Training: ఉపాధ్యాయులకు శిక్షణ
తణుకు అర్బన్: విద్యార్థులతో సైన్స్ ప్రాజెక్టులు రూపొందించేందుకు ఉపాధ్యాయులు వర్క్‌షాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.వెంకటరమణ అన్నారు. తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో బుధవారం తణుకు, తాడేపల్లిగూడెం డివిజన్‌ల పరిధిలో సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఇన్‌స్పైర్ అవార్డ్స్ వర్క్‌షాప్ శిక్షణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలోని అంశాలను ఆకళింపు చేసుకుని విద్యార్థులతో ఉపయుక్తమైన ప్రాజెక్టులు తయారు చేయించాలని సూచించారు. అనంతరం ఇన్‌స్పైర్ అవార్డుల కార్యక్రమ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. హెచ్‌ఎం కె.పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ కె.సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి శ్యామ్‌ప్రసాద్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Velugu Abhyasamithra: విద్యార్థుల్లోని సామర్థ్యాలు వెలికితీయాలి: నోడల్ అధికారి వెంకటయ్య