Summer Holidays Extended Due to Heatwave 2023 : జులై 1వ తేదీ వరకు స్కూల్స్‌కు వేసవి సెలవుల పొడిగింపు.. కేంద్రం కీలక భేటీ..
బయటికి రావాలంటే.. జనాలు అల్లాడుతున్నారు.ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
దేశమంతటా వేడిగాలులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గడ్, ఒడిశా, యూపీ ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ కూడా స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగించింది.
☛ Schools Holidays : ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. కారణం ఇదే..
జులై 1వ తేదీన స్కూల్స్ రీ ఓపెన్..
తీవ్రమైన వడగాల్పుల కారణంగా స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు మధ్యప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఒకటి నుంచి ఐదు తరగతుల ప్రైమరీ స్కూల్స్ జులై 1న రీ ఓపెన్ కానున్నాయి. ఇక ఆరు నుంచి 12 తరగతుల విద్యార్థులకు మాత్రం జూన్ 20న స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. అయితే జూన్ 30 వరకు ఒంటిపూట మాత్రమే స్కూల్స్ జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యామంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, నాన్-ఎయిడెడ్ స్కూల్స్ జులై 1 నుంచి ఫుల్‌టైమ్ వర్క్ చేయనున్నాయని తెలిపారు.
☛ AP Half Day Schools Extended : జూన్ 24వ తేదీ వరకు ఒంటి పూట బడులు పొడిగింపు.. వీలైతే..
పది రోజుల పాటు..
ఉష్ణోగ్రతలు తగ్గపోవడంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వేసవి సెలవులను పొడిగించాలని నిర్ణయించాం. ఒకటి నుంచి ఐదో తరగతికి సంబంధించిన ప్రాథమిక పాఠశాలలు జులై 1న ఓపెన్ అవుతాయి. ఆరు నుంచి 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు జూన్ 20 నుంచి పది రోజుల పాటు ఉదయం షిఫ్ట్‌లో నడుస్తాయి. జులై ఒకటి నుంచి అన్ని పాఠశాలలు సాధారణ టైమ్‌టేబుల్ ప్రకారం పనిచేస్తాయి. అని విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూళ్లకు..
గత షెడ్యూల్ ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని అన్ని స్కూల్స్ జూన్ 20న పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగించారు. స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
☛ ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
ఇతర రాష్ట్రాల్లో జూన్ 25 వరకు సెలవులు పొడిగింపు.. :
జూన్ నెలలో కూడా ఎండలు వేసవిని తలపిస్తుండటంతో ఇటీవల ఒడిశా ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం స్కూల్స్ జూన్ 19న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జూన్ 21న స్కూల్స్ రీఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఎండల తీవ్రత తగ్గకపోతే మరోసారి సెలవులను పొడిగించే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ స్కూళ్లకు వేసవి సెలవులను జూన్ 26 వరకు పొడిగించింది.
ఆంధప్రదేశ్, తెలంగాణలో మాత్రం స్కూల్స్ షెడ్యూల్ ప్రకారం ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఘోరంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రీష్మతాపంతో తల్లడిల్లిపోతోంది తెలంగాణా.ఎండలకు భయపడి పిల్లల రాక తగ్గిపోవడంతో స్కూళ్లలో హాజరు శాతం దారుణంగా పడిపోతోంది.
చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్స్‌కు..
ఈ లోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. పిల్లలు వడదెబ్బకు గురవుతారని బెంబేలెత్తిపోతున్నారు పేరెంట్స్. చదువుల కంటే తమ పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటూ బడిబాటకు విరామం కోరుతున్నారు. ఏపీలో ఒంటిపూట బడులు ముగిసిపోయాయి. ఎండ తీవ్రత తగ్గేదాకా సెలవులు ప్రకటించాలని కోరుతున్నాయి పేరెంట్స్ అసోసియేషన్లు. విద్యార్థి సంఘాలు కూడా పేరెంట్స్ ఆందోళనకు సపోర్ట్‌గా నిలబడుతున్నాయి. మరి ప్రభుత్వం సెలవులు ఇస్తుందా..? లేదా ఒంటి పూట బడులు కొనసాగిస్తుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా సెలవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
చదవండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్ డిప్లొమా.. భవితకు ధీమా
కేంద్రం కీలక భేటీ..
సూర్యుడి ప్రతాపానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని చోట్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. జూన్ నెల వచ్చినా దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పలు రాష్ట్రాల్లో రుతుపవనాల జాడలేక, వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. వైద్యశాఖ సంసిద్ధతను సమీక్షించేందుకు జూన్ 20వ తేదీ (మంగళవారం) ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. బిహార్‌లోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. వడదెబ్బ కారణంగా జూన్ 19వ తేదీ (సోమవారం) నాటికి ఆ రాష్ట్రంలో 81 మంది మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బలియా ఆసుపత్రిలో మిస్టరీ మరణాలు కొనసాగుతున్నాయి. సోమవారం మరో 11 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 68కి చేరుకున్నాయి. ఇవి వడదెబ్బ మరణాలే అనివైద్యాధికారులు చెబుతున్నారు. దీంతోపాటు పలు కారణాలున్నాయని అంటున్నారు.
తెలుగురాష్ట్రాల్లో ప్రజలు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారం కూడా తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగింది. పలుచోట్ల సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలులు వీచాయి. జూన్ 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల రుతుపవనాలు నిలిచిపోయాయి. వాటిలో ప్రస్తుతం కదలిక ప్రారంభమైంది. జూన్ 22వ తేదీ నాటికి తెలంగాణలో ప్రవేశించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అంచనావేస్తోంది. ఈ వేడి గాలుల దెబ్బకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవుల్ని పొడిగించాయి. మరికొన్ని చోట్ల పాఠశాల సమయాలను కుదించాయి.