Schools Holidays : ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. కారణం ఇదే..
మరో వైపు మన ప్రక్కన ఉన్న తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. జూన్ 18వ ఉదయం 8.30 నుంచి జూన్ 19వ తేదీ ఉదయం 5.30 గంటల మధ్య మీనంబాకంలో రికార్డుస్థాయిలో 137.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు భారీగా నిలిచిపోయింది. వాహనాలు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
☛ AP Half Day Schools Extended : జూన్ 24వ తేదీ వరకు ఒంటి పూట బడులు పొడిగింపు.. వీలైతే..
సెలవులను పొడిగించే అవకాశం..?
నేడు కూడా తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువన్నామలై, కళ్లకురిచి, విల్లుపురం, కడలూర్, మైలాదుతురై, నాగపట్టణం, తిరువారూర్, తంజావూర్, తిరుచ్చి, అరియలూర్, పెరంబలూర్‌తోపాటు పుదుచ్చేరి, కరైకుల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్, రాణిపేట్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇంకా వానలు ఎక్కువైతే ఈ సెలవులను పొడిగించే అవకాశం ఉంది.
➤☛ ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్