AP Half Day Schools Extended : జూన్ 24వ తేదీ వరకు ఒంటి పూట బడులు పొడిగింపు.. వీలైతే..
ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
➤☛ ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
టైమ్ టేబుల్ ఇదే..
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఎండల తీవ్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 24వ తేదీ వరకు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు బోధన సమయం, ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ, ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది.
చదువుల కంటే తమ పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటూ..
ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. పిల్లలు వడదెబ్బకు గురవుతారని బెంబేలెత్తిపోతున్నారు పేరెంట్స్. చదువుల కంటే తమ పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటూ బడిబాటకు విరామం కోరుతున్నారు. ఏపీలో ఒంటిపూట బడులు ముగిసిపోయాయి.
ప్రభుత్వం సెలవులు ఇస్తుందా..?
ఎండ తీవ్రత తగ్గేదాకా సెలవులు ప్రకటించాలని కోరుతున్నాయి పేరెంట్స్ అసోసియేషన్లు. విద్యార్థి సంఘాలు కూడా పేరెంట్స్ ఆందోళనకు సపోర్ట్‌గా నిలబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటి పూట బడులను జూన్ 24వ తేదీ వరకు పొడిగించారు. ఒక వేళ ఎండ తీవ్రత పెరిగితే ఒంటి పూట బడులను పొడిగించాలా.. లేదా సెలవులు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.
చదవండి: Jagananna Vidya Kanuka: తల్లితండ్రులపై భారం పడకుండా
ఎండలు కాస్త తగ్గాకే స్కూల్స్ ఓపెన్ చేస్తే బాగుంటుందని..
వైద్య నిపుణులు కూడా విపరీతమైన ఎండల్లో పిల్లలను స్కూల్ కు పంపిస్తే డీ హైడ్రేషన్, వడదెబ్బలకు గురై అనారోగ్యాల భారిన పడతారని సూచిస్తున్నారు. ఎండలు కాస్త తగ్గాకే స్కూల్స్ ఓపెన్ చేస్తే బాగుంటుందని వైద్య, విద్యారంగానికి చెందిన నిపుణులు సూచనలు చేస్తున్నారు. మరి ఈ విషయం పై ఇరు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.
☛ Andhra Pradesh: బడి గంట రోజే ఈ ‘కానుక’
చదవండి: School Education Department: బడికి రప్పించేలా రవాణా చార్జీలు
ఆంధ్రప్రదేశ్ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ 2023–24 ఇదే.. :
జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ 2023–24ను విడుదల చేశారు. స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు.
ఏపీలో ఈ ఏడాది (2023-24) సెలవులు ఇలా..
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు క్రిస్టమస్ సెలవులు (మిషనరీ స్కూల్స్‌కు మాత్రమే..)
☛ ఇంకా దీపావళి, ఉగాది, రంజాన్ మొదలైన పండగలకు ఆ రోజును బట్టి సెలవులు ఇవ్వనున్నారు.