Half Day Schools: ఏపీలో రేపటి నుంచి ఒంటి పూట బడి
తీవ్రమైన వడగాల్పలు వీస్తుండడంతో విద్యార్థులకు ఒంటి పూట బడులే నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల డేట్ ఇదే... ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎంతంటే...
ఏపీలో ఎండలు మండుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యమవడంతో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. జిల్లాల్లో సరాసరిగా 42 నుంచి 45 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండల తీవ్రత దృష్ట్యా వారం పాటు ఒక్కపూటనే పాఠశాలలు తెరవాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
జూన్ 12 నుంచి జూన్ 17వ తేదీ వరకు ఒంటి పూట బడులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో రాగి జావ, 11.30 నుంచి 12 గంటల వరకు జగనన్న గోరుముద్ద అందించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: నిఘా నీడలో... ప్రశాంతంగా ప్రారంభమైన ప్రిలిమ్స్ పరీక్ష
యూనిఫామ్ కుట్టించి.. పరిశీలించి..
ఒకటో తరగతి నుంచి 10వ తరగతి బాల బాలికలకు వేర్వేరు కొలతల్లో క్లాత్ ఇస్తున్నారు. ఇచ్చిన క్లాత్‌లో మూడు జతలు వస్తాయా.. రావా? అని ఒకటికి రెండుసార్లు అధికారులు పరిశీలించారు.
TSPSC Group 1 Prelims: బూట్లు, ఫోన్లతో వస్తే గేటు బయటే... ఓన్లీ చెప్పులతో వస్తేనే అనుమతి
ఒకటి నుంచి 10వ తరగతి వరకు బాలబాలికలను ఎంపిక చేసి, వారి కొలతలను తీసుకున్నారు. తరగతుల వారీగా ఇచ్చిన క్లాత్‌తో మూడు జతల యూనిఫారాలు రావడంతో సంతృప్తి చెందిన అనంతరం క్లాత్‌ను విద్యా కానుక కిట్‌లో అందిస్తున్నారు.