TSPSC Group 1 Prelims Exam: నిఘా నీడలో... ప్రశాంతంగా ప్రారంభమైన ప్రిలిమ్స్ పరీక్ష
మొదటి నుంచి అధికారులు నిబంధనలను అభ్యర్థులకు చేరవేశారు. కానీ, చాలా మంది అభ్యర్థులు ఉదాసీనంగా పరీక్ష కేంద్రాలకు వచ్చారు. బూట్లు, ఆభరణాలు, ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చారు. వీటినన్నింటిని పరీక్ష కేంద్రం గేటు బయటే ఉంచి వెళ్లాలని పోలీసులు అభ్యర్థులకు చెప్పారు.
TSPSC Group 1 Prelims Question Paper & Key 2023: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం & కీ సాక్షి ఎడ్యుకేషన్‌లో చూడొచ్చు
ముందే చెప్పిన విధంగా 10.15 గంటలకే గేట్లు మూసేశారు. దీంతో కొద్దిగా ఆలస్యంగా చేరుకున్న అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ప్రిలిమనరీ పరీక్ష ప్రశాంతంగా సాగుతోంది. పరీక్షను అడ్డుకోవాలని కొంతమంది చూసినప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
TSPSC Group 1 Prelims: బూట్లు, ఫోన్లతో వస్తే గేటు బయటే... ఓన్లీ చెప్పులతో వస్తేనే అనుమతి
వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యోగ (గ్రూప్–1) ఖాళీలున్నాయి. వీటికి 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా, గత అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,86,051 మంది హాజరయ్యారు. అనంతరం మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన వారి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే.
☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం, అలాగే కీ... సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. పరీక్ష ముగిసిన వెంటనే ప్రశ్నపత్రాన్ని చూసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్ నిపుణులతో తయారుచేయించిన కీని కూడా మీరు చూసుకోవచ్చు. సాక్షి ఎడ్యుకేషన్ ఇచ్చే కీ అభ్యర్థుల ప్రాథమిక అవగాహన కోసమే అని గుర్తుంచుకోగలరు. అంతిమంగా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే కీని మాత్రమే అభ్యర్థులు అధికారికంగా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది.