TSPSC Group 1 Prelims Question Paper & Key 2023: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం & కీ సాక్షి ఎడ్యుకేషన్‌లో చూడొచ్చు
పరీక్షకు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2.60 లక్షల మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హాల్ టికెట్ మీద ఫొటో, ముగ్గురు గెజిటెడ్ ఆఫీసర్లతో సంతకం పెట్టించుకుని పరీక్షకు రావాలని అధికారులు సూచించారు.
TSPSC Group 1 Prelims: బూట్లు, ఫోన్లతో వస్తే గేటు బయటే... ఓన్లీ చెప్పులతో వస్తేనే అనుమతి
ఆదివారం ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. 3 గంటల పాటు పరీక్ష జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం, అలాగే కీ సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. పరీక్ష ముగిసిన వెంటనే ప్రశ్నపత్రాన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్ నిపుణులతో తయారుచేయించిన కీని కూడా మీరు చూసుకోవచ్చు.
☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
సాక్షి ఎడ్యుకేషన్ ఇచ్చే కీని అభ్యర్థుల ప్రాథమిక అవగాహన కోసమే అని గుర్తుంచుకోగలరు. అంతిమంగా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే కీని మాత్రమే అభ్యర్థులు పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది.
☛ చివిరి నిమిషంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. గ్రూప్ 1 అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే.
పోస్టు | ఖాళీలు | వయో పరిమితి |
డిప్యూటీ కలెక్టర్ | 42 | 18–44 |
డీఎస్పీ | 91 | 21–31 |
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ | 48 | 18–44 |
రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ | 4 | 21–31 |
జిల్లా పంచాయతీ అధికారి | 5 | 18–44 |
జిల్లా రిజి్రస్టార్ | 5 | 18–44 |
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్) | 2 | 21–31 |
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ | 8 | 18–44 |
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | 26 | 21–31 |
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2) | 41 | 18–44 |
అసిస్టెంట్ డైరెక్టర్ (సాంఘిక సంక్షేమం) | 3 | 18–44 |
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం) | 5 | 18–44 |
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం) | 2 | 18–44 |
జిల్లా ఉపాధి కల్పనాధికారి | 2 | 18–44 |
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ) | 20 | 18–44 |
అసిస్టెంట్ ట్రెజరర్(ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) | 38 | 18–44 |
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(స్టేట్ ఆడిట్ సరీ్వస్) | 40 | 18–44 |
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) | 121 | 18–44 |