Skip to main content

TSPSC Group 1 Prelims: బూట్లు, ఫోన్ల‌తో వ‌స్తే గేటు బ‌య‌టే... ఓన్లీ చెప్పుల‌తో వ‌స్తేనే అనుమ‌తి

టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించ‌నున్న గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. 2022 అక్టోబ‌ర్ 16న నిర్వ‌హించిన ప‌రీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం లీకైన విష‌యం తెలియ‌డంతో దాన్ని ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో జూన్ 11(ఆదివారం)వ తేదీన నిర్వ‌హించే ప‌రీక్ష‌కు అధికారులు ప‌టిష్ట ఏర్పాట్లు చేశారు.
TSPSC Group 1 Prelims
TSPSC Group 1 Prelims

పరీక్షకు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2.60 లక్షల మంది అభ్యర్థులు హాల్​టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హాల్ టికెట్ మీద ఫొటో, ముగ్గురు గెజిటెడ్ ఆఫీసర్లతో సంతకం పెట్టించుకుని ప‌రీక్ష‌కు రావాలని అధికారులు సూచించారు. 

☛ చివిరి నిమిషంలో ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి.. గ్రూప్ 1 అభ్య‌ర్థుల‌కు ఆల్ ద బెస్ట్‌

tspsc

ఫోన్లు, బూట్లల‌తో వ‌స్తే ఎటువంటి ప‌రిస్థితుల్లో అనుమ‌తించే ప్ర‌సక్తే లేద‌ని అధికారులు తేల్చిచెబుతున్నారు. ప‌రీక్ష కేంద్రంలోనికి చెప్పుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే ప్యాంటుకు బెల్ట్ తో వ‌స్తే దాన్ని తీసి చెక్ చేసిన త‌ర్వాతే అభ్య‌ర్థిని లోనికి అనుమ‌తిస్తారు. 

☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

students

మ‌హిళ‌లు ఆభ‌ర‌ణాల‌తో రావొద్ద‌ని అధికారులు చెబుతున్నారు. పరీక్షల నిర్వహణపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సెంటర్ల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన త‌ర్వాతే లోనికి పంపిస్తారు. ఇన్విజిలేటర్లతో సహా పరీక్షా కేంద్రంలోకి ఎవ్వరూ సెల్ ఫోన్లు తీసుకుపోవద్దని ఆదేశాలు జారీ చేశారు.

students

☛ ఈ ప్ర‌శ్న‌కు మీరైతే ఏం స‌మాధానం చెప్తారు.. సివిల్స్ ఇంట‌ర్వ్యూలో అడిగిన ప్ర‌శ్న‌ను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి

నిబంధనలను ఇప్పటికే అభ్యర్థుల సెల్ ఫోన్లకు మెసేజ్ ల రూపంలో పంపించారు. ఉదయం 8:30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారు.  10.15  గంటలకు గేట్లు క్లోజ్ చేస్తారు. 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమ‌వుతుంది. హాల్ టికెట్, ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి. 

tspsc

☛ TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? 

పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదైన ఒక ఒరిజిన‌ల్ గుర్తింపుకార్డు త‌ప్ప‌నిస‌రి. క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్​ వస్తువులు, విలువైన ఆభరణాలను కేంద్రంలోనికి అనుమ‌తించ‌రు. బబ్లింగ్​కు బాల్ పాయింట్ పెన్ (బ్లూ/బ్లాక్) మాత్రమే ఉపయోగించాలి.  హాల్ టికెట్ నెంబర్, క్వశ్చన్ బుక్ లెట్ నెంబర్ జాగ్రత్తగా ఎన్​ కోడ్ చేయాలి.

Published date : 10 Jun 2023 03:46PM

Photo Stories