UPSC Interview Questions: ఈ ప్రశ్నకు మీరైతే ఏం సమాధానం చెప్తారు.. సివిల్స్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఐఎస్, ఐడీఈఎస్.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షకు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసా..!
చదవండి: సివిల్స్-2023 ప్రిలిమ్స్ కొశ్చన్ పేపర్ & కీ సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో..
ప్రిలిమ్స్‌కు అడిగే ప్రశ్నలే కఠినంగా ఉంటాయి. ఇక ప్రిలిమ్స్, మెయిన్స్ క్వాలిఫై అయిన చాలా మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంటారు. కేవలం పుస్తక జ్ఞానం మీదనే కాకుండా సమయస్పూర్తి, తెలివితేటలు, ఆలోచనాతీరు, సామాజిక విషయాల మీద కూడా సివిల్స్‌లో ప్రశ్నలుంటాయి.
గతంలో ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన ప్రశ్నను పర్వీన్ కస్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు. మీరైతే ఏం సమాధానం చెప్పేవారు అని సూటిగా ప్రశ్నించారు. ఇంతకూ ఆయన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసుకుందామా.
'దేశం పేదరికంతో పోరాడుతున్నప్పుడు అంతరిక్షప్రయోగాల కోసం భారతదేశం చేస్తున్న ఖర్చు గురించి మీ అభిప్రాయం ఏంటి?'
చదవండి: అదరగొట్టిన యూపీఎస్సీ టాపర్ ఇషితా కిషోర్... ఆమెకు వచ్చిన మార్కులు ఎన్నంటే...
ఈ ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
'సార్ మీరు అడిగిన రెండూ పోటీ స్వభావంతో ఉన్నవి కాదని అనుకుంటున్నా. 1928లో డాక్టర్ సి.వి రామన్ సముద్రపు నీటి గురించి ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఈరోజు అదే రామన్ కనిపెట్టిన స్పెక్ట్రోస్కోపీ(spectroscopy) వైద్యశాస్త్రంతో సహా అనేక రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రతి పరిశోధనా విలువైనదే.. దాని ఫలితం రావడానికి సమయం పడుతుంది అంతే..' అని సమాధానం ఇచ్చారు.
తర్వాత మీరైతే ఏ సమాధానం చెప్పేవారు అంటూ ఆయన నెటిజన్లను ప్రశ్నించడంతో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతున్నారు. అదే మీరయితే ఏ సమాధానం చెప్పేవారు?
చదవండి: ఆరేళ్ల కష్టానికి ఫలితం.. ఒకేసారి మూడు కేంద్ర కొలువులు... నా సక్సెస్ సీక్రెట్ ఇదే...
అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ ఏడాది మే 28న సివిల్ సర్వీసెస్ 2023 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి పరీక్షలో అడిగిన పలు ప్రశ్నలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో 87వ ప్రశ్న ఉడుతలకు సంబంధించింది. ఇది అభ్యర్థులను తికమకపెడుతోంది. చూడడానికి సరళంగా ఉన్నా ఈ ప్రశ్నకు జవాబు మాత్రం ఒక్కోక్కరు ఒక్కోవిధంగా చెబుతున్నారు. ఇది కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
చదవండి: 23 ఏళ్లకే ఐఏఎస్... ఎలాంటి కోచింగ్ లేకుండానే కశ్మీర్ నుంచి సత్తాచాటిన యువతి
ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. గతంలో ఉడుతల గురించి షేర్ చేసిన సమాచారాన్ని జోడించి... ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆయన వివరించారు. ఇంతకూ ఆ ప్రశ్న ఏంటంటే...
87. భారతీయ ఉడుతలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణనలోకి తీసుకొని ఏది నిజమో తెలియజేయండి?
ఎ. ఇవి భూమిలో బొరియలు తయారు చేయడం ద్వారా గూళ్లు నిర్మించుకుంటాయి.
బి. ఇవి కాయలు, విత్తనాలు వంటి ఆహార పదార్థాలను భూమిలో నిల్వ చేస్తాయి.
సి. ఇవి సర్వభక్షకాలు
ఇందులో ఆన్సర్ ఏంటో మీకు తెలుసా..?
ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ చెప్పిన సమాధా