UPSC Civils Prelims Question Paper With Key 2023 : సివిల్స్-2023 ప్రిలిమ్స్ కొశ్చన్ పేపర్ & కీ సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో..
UPSC Civil Services Prelims 2023 పరీక్షకు సంబంధించిన కొశ్చన్ పేపర్ & కీ ని సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.. ఈ UPSC Civil Services Prelims Key 2023 ని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) ప్రిపేర్ చేయించింది. ఈ 'కీ' కేవలం ఒక అవగాహణ కోసమే. అంతిమంగా యూనియన్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే కీ నే ప్రామాణికంగా తీసుకోండి. ఈ యూపీఎస్సీ మొత్తం 1,105 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు.
ఒక్కో పోస్టుకు..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. ఒక్కో పోస్టుకు 1:12.5 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. చివరిగా పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది.
UPSC PRELIMS CUTOFFS (YEAR-WISE) :
Year | GENERAL | EWS | OBC | SC | ST |
2019 | 98.00 | 90.00 | 95.34 | 82.00 | 77.34 |
2020 | 92.51 | 77.55 | 89.12 | 74.84 | 68.71 |
2021 | 87.54 | 80.14 | 84.85 | 75.41 | 70.71 |
2022 | 88.22 | 82.83 | 87.54 | 74.08 | 69.35 |
2023(EXPECTED) | 86-91 | 79-84 | 85-89 | 72-76 | 68-74 |
Subject-wise No. Of Questions :
S.No | Subject | No. Of Question |
1 | POLITY | 16 |
2 | ENVIRONMENT | 12 |
3 | ECONOMY | 19 |
4 | CURRENT AFFAIRS, GOVT.SCHEMES & SPORTS | 5 |
5 | SCIENCE & TECHNOLOGY | 10 |
6 | GEOGRAPHY | 20 |
7 | HISTORY (ANCIENT-8, MEDIEVAL-2, MODERN-2) | 12 |
8 | INTERNATIONAL RELATIONS | 6 |
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ-2023 కొశ్చన్ పేపర్ & 'కీ' ఇదే..