Skip to main content

TSPSC Group 1 Prelims: చివిరి నిమిషంలో ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి.. గ్రూప్ 1 అభ్య‌ర్థుల‌కు ఆల్ ద బెస్ట్‌

అనేక అడ్డంకులు దాటుకుని గ్రూప్ 1 ప‌రీక్ష ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం జూన్ 11న జ‌ర‌గ‌నుంది. ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని కోరుతూ అనేక‌సార్లు అనేక మంది హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో అభ్య‌ర్థులు ఒకింత ఒత్తిడికి గుర‌య్యారు. అయితే వాయిదా వేసే అవ‌స‌రం లేద‌ని హైకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పునివ్వ‌డంతో అనుకున్న ప్రకారం ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.
TSPSC Group 1 Prelims
TSPSC Group 1 Prelims

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసింది ప్ర‌భుత్వం. ప‌రీక్ష‌కు కేవ‌లం ఒక‌ రోజు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ స‌మ‌యంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే ప‌రీక్ష‌లో త‌ప్పులు చేసే అవ‌కాశం ఉండ‌దో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంక‌ర్  రాణి సుష్మిత కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవి మీకోసం....   

ఈ ప్ర‌శ్న‌కు మీరైతే ఏం స‌మాధానం చెప్తారు.. సివిల్స్ ఇంట‌ర్వ్యూలో అడిగిన ప్ర‌శ్న‌ను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి

☛ ప‌రీక్ష ప్రారంభం అవడానికి ఒక వారం ముందునుంచి చ‌ద‌వ‌డం త‌గ్గించాలి. చ‌దివిన స‌బ్జెక్ట్‌ను రివిజ‌న్ చేయ‌డానికి అధిక స‌మ‌యం కేటాయించాలి.

tspsc

☛ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌ను, ముఖ్య‌మైన పాయింట్ల‌ను రివైజ్ చేసుకోండి.

☛ సుల‌భ‌మైన ప్ర‌శ్న‌ల‌కు త‌ప్పు స‌మాధానం అస్స‌లు ఇవ్వ‌కండి

☛ ప్ర‌శ్న చూడ‌డానికి సింపుల్‌గానే ఉంటుంది. కానీ, జ‌వాబు తిక‌మ‌క‌పెడుతుంది. కాబ‌ట్టి చిన్న చిన్న త‌ప్పులు చేయ‌కూడ‌దు అంటే ప్ర‌శ్న‌ను ఒక‌టికి, రెండు సార్లు పూర్తిగా చ‌దివి అర్థం చేసుకోండి. 

☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

☛ గుడ్డిగా స‌మాధానాన్ని గుర్తించ‌కండి. స‌మాధానం రాసే ముందు క‌చ్చితంగా ఆలోచించాలి. 

☛ ప్ర‌శ్నాప‌త్రం చూడ‌గానే మీకు కంగారు ప‌డ‌కండి. ప్ర‌శ్న‌లు క‌ఠినంగా వ‌చ్చాయి అనిపిస్తే... మీతో పాటు ప‌రీక్ష రాసేవారికి కూడా క‌ఠినంగానే ఉంటుంది. ఈ విష‌యాన్ని గుర్తించుకోండి.

TSPSC Group 1 : గుర్తింపుకార్డు త‌ప్ప‌నిస‌రి... 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత

Dr Rani Sushmitha
Dr Rani Sushmitha

☛ మీ పాత టెస్ట్ సిరీస్ లో తప్పుగా రాసిన‌ కఠినమైన ప్రశ్నలకు తెలివిగా స‌మాధానాలు రాయండి. 

☛ ప్రిలిమ్స్ పరీక్ష అనేడి అభ్య‌ర్థుల‌ను వ‌డ‌పోసేందుకు నిర్వ‌హించే ప్రాథ‌మిక ప‌రీక్ష‌. ఈ ప‌రీక్ష‌కు ఎక్కువ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కానీ, అర్హత సాధించడానికి ప్రయత్నించండి.
 
☛ ప‌రీక్ష ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది ఒత్తిడికి లోనుకావొద్దు. స‌మ‌యానికి ప‌డుకోండి. కంటి నిండా నిద్ర‌పోండి. ప‌రీక్ష రాయ‌డానికి ఆరోగ్యం కూడా స‌హ‌క‌రించాలి. 

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? 

గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.

Published date : 10 Jun 2023 03:12PM

Photo Stories