Skip to main content

TSPSC Group 1 hall ticket released: గుర్తింపుకార్డు త‌ప్ప‌నిస‌రి... 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత

జూన్ 11న నిర్వ‌హించనున్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప‌రీక్ష‌కు కేవ‌లం ఐదు రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది. అయితే ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్ల‌ను టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసింది.
TSPSC
TSPSC

ప‌రీక్ష కేంద్రానికి నిర్ణీత స‌మ‌యం కంటే ముందుగానే చేరుకోవాల‌ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? 

తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి జూన్ 11న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎవరినీ అనుమతించబోమని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ పలు సూచనలు చేసింది.

tspsc

 ఓఎంఆర్‌ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వరు.

 ఓఎంఆర్‌ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్‌ చేయాలి. 

 సరైన వివరాలు బబ్లింగ్‌ చేయని, పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌ ఉపయోగించిన, డబుల్‌ బబ్లింగ్‌ చేసిన పత్రాలు చెల్లుబాటు కావు. 

 అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌, పాన్‌ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాలి. 

 వీటి విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్‌ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేయ‌నున్నారు.

tspsc

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ‌లో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. అక్టోబర్‌ 16న పరీక్ష నిర్వ‌హించింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,85,916 మంది హాజరయ్యారు. మెయిన్స్‌కు 25,050 మంది ఎంపికయ్యారు.

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

tspsc

అభ్య‌ర్థుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను టీఎస్‌పీఎస్సీ ర‌ద్దు చేసింది. పేప‌ర్ లీక్ అవ‌డంతో వేరే గ‌త్యంత‌రం లేక అప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన అన్ని ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసేసి, మ‌ళ్లీ రీ షెడ్యూల్ ప్ర‌క‌టించింది. లీకేజీ ఘ‌ట‌న పున‌రావ‌`త‌మ‌వ‌కుండా ప్ర‌త్యేకంగా ప‌రీక్ష‌ల బోర్డును ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌గా బీఎం సంతోష్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌ జగదీశ్వర్‌ రెడ్డిని నియమించింది.

హాల్ టికెట్ కోసం క్లిక్ చేయండి 

https://hallticket.tspsc.gov.in/

Published date : 06 Jun 2023 05:40PM

Photo Stories