AP Half day School 2023 : ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఒంటి పూట బడులు.. అలాగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు.. ఎందుకంటే..?
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
చదవండి: ఏపీ పాలీసెట్ - స్టడీ మెటీరియల్ | ప్రివియస్ పేపర్స్ | 10TH క్లాస్ తర్వాత | ఏపీ టెన్త్ క్లాస్ | టిఎస్ టెన్త్ క్లాస్
ఈ పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు..
అలాగే రాష్ట్రంలో 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. ఆరు సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు.
విద్యార్థులు ఇవి పాటించాల్సిందే..
ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్టు వెల్లడించారు. ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. హాల్‌టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని చెప్పారు. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
➤ పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
ఏపీ 2023 ఏడాదిలో సెలవులు పూర్తి వివరాలు ఇవే..
పండుగ/పర్వదినం |
తేదీ |
వారం |
భోగి |
14–01–2023 |
శనివారం |
మకర సంక్రాంతి |
15–01–2023 |
ఆదివారం |
కనుమ |
16–01–2023 |
సోమవారం |
రిపబ్లిక్ డే |
26–01–2023 |
గురువారం |
మహాశివరాత్రి |
18–02–2023 |
శనివారం |
హోలి |
08–03–2023 |
బుధవారం |
ఉగాది |
22–03–2023 |
బుధవారం |
శ్రీరామనవవిు |
30–03–2023 |
గురువారం |
బాబు జగజ్జీవన్‌రామ్ జయంతి |
05–04–2023 |
బుధవారం |
గుడ్ ప్రైడే |
07–04–2023 |
శుక్రవారం |
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి |
14–04–2023 |
శుక్రవారం |
రంజాన్ |
22–04–2023 |
శనివారం |
బక్రీద్ |
29–06–2023 |
గురువారం |
మొహర్రం |
29–07–2023 |
శనివారం |
స్వాతంత్య్ర దినోత్సవం |
15–08–2023 |
మంగళవారం |
శ్రీకృష్ణాష్టమి |
06–09–2023 |
బుధవారం |
వినాయకచవితి |
18–09–2023 |
సోమవారం |
ఈద్ మిలాదున్ నబీ |
28–09–2023 |
గురువారం |
మహాత్మాగాంధీ జయంతి |
02–10–2023 |
సోమవారం |
దుర్గాష్టమి |
22–10–2023 |
ఆదివారం |
విజయదశమి |
23–10–2023 |
సోమవారం |
దీపావళి |
12–11–2023 |
ఆదివారం |
క్రిస్‌మస్ |
25–12–2023 |
సోమవారం |
రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే..
భోగి |
14–01–2023 |
రెండో శనివారం |
మకర సంక్రాంతి |
15–01–2023 |
ఆదివారం |
దుర్గాష్టమి |
22–10–2023 |
ఆదివారం |
దీపావళి |
12–11–2023 |
ఆదివారం |
2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..
కొత్త ఏడాది |
01–01–2023 |
ఆదివారం |
హజ్రత్ అలీ పుట్టినరోజు |
05–02–2023 |
ఆదివారం |
షబ్–ఇ–బారత్ |
07–03–2023 |
శుక్రవారం |
మహావీర్ జయంతి |
04–04–2023 |
మంగళవారం |
షబ్–ఇ–ఖాదర్ |
18–04–2023 |
మంగళవారం |
జుమాతుల్ వాడ |
21–04–2023 |
శుక్రవారం |
బసవజయంతి |
23–04–2023 |
ఆదివారం |
షహద్ హజ్రత్ అలీ |
24–04–2023 |
సోమవారం |
బుద్ధపూర్ణిమ |
05–05–2023 |
శుక్రవారం |
రథయాత్ర |
20–06–2023 |
మంగళవారం |
ఈద్–ఇ–గదీర్ |
06–07–2023 |
గురువారం |
9వ మొహర్రం |
28–07–2023 |
శుక్రవారం |
పార్సీ నూతన సంవత్సరం డే |
16–08–2023 |
బుధవారం |
వరలక్ష్మీవ్రతం |
25–08–2023 |
శుక్రవారం |
అర్బయిన్ (చాహల్లమ్) |
05–09–2023 |
మంగళవారం |
హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు |
09–09–2023 |
శనివారం |
మహాలయ అమావాస్య |
14–10–2023 |
శనివారం |
విజయదశమి (తిధిద్వయం) |
24–10–2023 |
మంగళవారం |
యాజ్–దహుమ్–షరీఫ్ |
26–10–2023 |
గురువారం |
కార్తీకపూర్ణీమ/గురునానక్ జయంతి |
27–11–2023 |
సోమవారం |
క్రిస్మస్ ఈవ్ |
24–12–2023 |
ఆదివారం |
బాక్సింగ్ డే |
26–12–2023 |
మంగళవారం |