School Summer Holidays : మండే ఎండలు.. దారుణంగా పడిపోయిన హాజరు శాతం.. స్కూల్స్‌కు సెలవులు ఇవ్వాలనే ఆలోచనలో..?
ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇంకా ప్రారంభించలేదు. రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చాయి అనే వార్త వినగానే.. హమ్మయ్య ఇక ఎండలు నుంచి రిలీఫ్ వస్తుందని భావించాం. కానీ సీన్ రివర్స్. బిపర్ జోయ్ తుఫాన్ కారణంగా రుతుపవనాల వాన జాడే కనిపించడం లేదు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లలు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. విద్యాశాఖ అధికారులు కూడా.. స్కూల్స్ సెలవుల విషయంలో ఆలోచిస్తున్నారు.
➤☛ Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
స్కూళ్లలో హాజరు శాతం దారుణంగా ఉంది.. కానీ..
జూన్ చివరివారంలో పడుతున్నా సమ్మర్ గండం వీడిపోవడం లేదు. మిగతా వాళ్లసంగతేమో గాని స్కూళ్లకెళ్లే పిల్లల మీద వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. బడికెళ్లడమా వద్దా అనే సంశయంతోనే రోజులు గడిచిపోతున్నాయి. పేరెంట్స్ పిల్లల ఆరోగ్యమా, చదువులా అనే డైలమాతోనే తల్లడిల్లిపోతున్నారు. మండేసూర్యుడు నడినెత్తిన నాట్యమాడేస్తున్నాడు.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోరమైన పరిస్థితి. ముఖ్యంగా గ్రీష్మతాపంతో తల్లడిల్లిపోతోంది తెలంగాణా. రామగుండంలో నిన్న 44 డిగ్రీల టెంపరేచర్ నమోదైందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎండలకు భయపడి పిల్లల రాక తగ్గిపోవడంతో స్కూళ్లలో హాజరు శాతం దారుణంగా పడిపోతోంది.
ప్రభుత్వ స్కూళ్లలో రెండుపూట్లా బడి నడుస్తోంది.. కానీ
కొన్ని జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో రెండుపూట్లా బడి నడుస్తోంది. కానీ 60 శాతానికి మించి విద్యార్థుల్లేరు. కేవలం టీచర్లు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలోనూ అదే పరిస్థితి. ఒంటిపూట బడి పెట్టినా స్టూడెంట్స్‌కి తిప్పలు తప్పడం లేదు. జూన్‌లో ఎండలు తగ్గి వాతావరణం చల్లబడి.. ఉత్సాహంగా స్కూళ్లకెళ్లాల్సిన పిల్లల్లో నిరుత్సాహాన్ని నింపుతోంది గ్రీష్మతాపం. అటు.. ప్రైమరీ స్కూల్స్‌కి పిల్లల్ని పంపడం దాదాపుగా ఆపేశారు పేరెంట్స్.
ఇంక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దారుణంగా ఎండలు..
జూన్ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
చదువుల కంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యం..
ఈ లోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. పిల్లలు వడదెబ్బకు గురవుతారని బెంబేలెత్తిపోతున్నారు పేరెంట్స్. చదువుల కంటే తమ పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటూ బడిబాటకు విరామం కోరుతున్నారు. ఏపీలో ఒంటిపూట బడులు ముగిసిపోయాయి.
ఎండ తీవ్రత తగ్గేదాకా సెలవులు ప్రకటించాలని కోరుతున్నాయి పేరెంట్స్ అసోసియేషన్లు. విద్యార్థి సంఘాలు కూడా పేరెంట్స్ ఆందోళనకు సపోర్ట్‌గా నిలబడుతున్నాయి. మరి ప్రభుత్వం సెలవులు ఇస్తుందా..? లేదా ఒంటి పూట బడులు కొనసాగిస్తుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా సెలవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు.
➤☛ ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
పిల్లలను స్కూల్ కు పంపిస్తే..
వైద్య నిపుణులు కూడా విపరీతమైన ఎండల్లో పిల్లలను స్కూల్ కు పంపిస్తే డీ హైడ్రేషన్, వడదెబ్బలకు గురై అనారోగ్యాల భారిన పడతారని సూచిస్తున్నారు. ఎండలు కాస్త తగ్గాకే స్కూల్స్ ఓపెన్ చేస్తే బాగుంటుందని వైద్య, విద్యారంగానికి చెందిన నిపుణులు సూచనలు చేస్తున్నారు. మరి ఈ విషయం పై ఇరు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Telangana 2023-24 అకడమిక్ ఇయర్‌లో పరీక్షలు- సెలవులు ఇవే..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.