No Summer holidays 2023 : వీళ్లకు వేసవి సెలవులు లేవ్..! కారణం ఇదే..?
ఇంతలోనే నిబంధనలు తుంగలో తొక్కి పేద, వెనుకబడిన మధ్యలో బడి మానేసినా బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీల) టీచర్లను బడులకు రావాలని ఆదేశాలు జారీపై గందరగోళం నెలకొంది.
Summer Holidays 2023 in AP : ఏపీలో మే 1 నుంచే స్కూళ్లకు వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?
మునుపెన్నడూలేని విధంగా ఏ పాఠశాలల యాజమాన్యాల్లో లేని ఆంక్షలు కేజీబీవీలో విధులు నిర్వహించే నాన్‌టీచింగ్, నాన్‌టీచింగ్‌పై విధించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పిల్లలందరూ ఇంటిపట్టున ఉంటే టీచర్లంతా బడికి వెళ్లాలనే హుకుంపై పెదవి విరుస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను పర్మినెంట్ ప్రక్రియ చేపట్టగా..ఇంకోవైపు కేజీబీవీల్లో కాంట్రాక్టు విధులు నిర్వహిస్తున్న టీచర్ల క్రమబద్ధీకరణ మాటదెవుడేరుగు వేసవి సెలవులు అమలు చేయకపోవడంపై టీచర్లు వాపోతున్నారు.
బడికి వెళ్లాల్సిందే.. కానీ
కేజీబీవీల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు లేకపోయినా టీచర్లు బడికి వెళ్లి విధులు నిర్వహించాలని జూమ్ మీటింగ్ ద్వారా సూచించారు. టీచర్లు మే 31 వరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేయాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వీరికి మూడు రకాల విధులు కేటాయించారు. స్కూల్లో ఉంటూ ఆడ్మిషన్లు చేపట్టడం.. చుట్టుపక్కలా గ్రామాలకు వెళ్లి అడ్మిషన్ల కోసం గ్రామాలకు వెళ్లి ప్రచారం చేపట్టడం.. ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించాలని సూచించారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రతిక్లాస్‌లో 40 మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఆరో తరగతిలో 40 మందికి అవకాశాం ఉంటుంది. మిగిలిన క్లాస్‌లో ఎవరైనా వెళ్లిపోతే ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది.
చదవండి: ఏపీ పాలీసెట్ - స్టడీ మెటీరియల్ | ప్రివియస్ పేపర్స్ | 10TH క్లాస్ తర్వాత | ఏపీ టెన్త్ క్లాస్ | టిఎస్ టెన్త్ క్లాస్
స్కూల్స్ పున:ప్రారంభం కాకముందే..
విద్యాసంస్థల పున:ప్రారంభం కాకముందే నిర్దేశిత లక్ష్యం 40 మంది ఆడ్మిషన్లు పూర్తయి సీట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గ్రామాలకు వెళ్లి క్యాన్వసింగ్ చేయడం దేనికో అధికారులకు తెలియాలి. ఆన్‌లైన్ క్లాస్‌లు ఇంటిపట్టున ఉండి కూడా నిర్వహించవచ్చని టీచర్లు గుర్తుచేస్తున్నారు. బడులకు ఒకరిద్దరూ వెళ్తే సరిపోతుందని పూర్తిస్థాయిలో టీచర్లు వెళ్లాల్సిన అవసరం లేదనేది సంఘాల అభిప్రాయపడుతున్నాయి.
నాన్ టీచింగ్ సిబ్బంది పోపు డబ్బాలు క్లీనింగ్, ప్రాంగణాలు శుభ్రం చేయడం, కిచెన్ గార్డెన్‌కు ఏర్పాట్లు చేసుకోవాలనే చెప్పడం చర్చానీయంశంగా మారింది. అకౌంట్స్ రిపోర్టులు నివేదించడం.. ఏఎన్‌ఎంలు తప్పనిసరిగా రావాలని సూచించడంపై ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఇవన్నీ రోజు వారీ కార్యక్రమాలు కాగా ప్రత్యేకంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటూ పిల్లలు లేకుండా బడులు తెరవాలనే విద్యాశాఖ వింత నిర్ణయాలు టీచర్లు, సంఘాలు తప్పుబడుతున్నారు. ఎప్పటిలాగే కేజీబీవీల్లో పనిచేస్తున్న టీచర్లు, నాన్‌టీచింగ్‌కు సెలవులు అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.
చదవండి: జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు రీ ఓపెన్
వేసవి సెలవుల్లో పనిచేయాలనడం సరికాదు..
కేజీబీవీల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను వేసవి సెలవుల్లో పనిచేయాలనడం సరికాదు. ఉద్యోగులకు సెలవులు అమలు చేయాలి. సెలవుల్లో విధులు నిర్వహించాలనే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.
– బగ్గని రవికుమార్, తపస్ ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల
టీచర్లు తప్పనిసరిగా..
ఉన్నతాధికారుల ఆదేశానుసారం కేజీబీవీల్లో విధులు నిర్వహించే టీచర్లు తప్పనిసరిగా బడికి వెళ్లాలి. యాక్షన్ ప్లాన్ తయారు చేయడం..బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలి.
– పద్మజ, సెక్టోరల్ అధికారి, మంచిర్యాల