AP Inter Colleges Holidays 2023-24: ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఈ సారి భారీగానే సెలవులు
Sakshi Education
ఇంటర్ చేరబోయే విద్యార్థులకు ఇది గుడ్‌న్యూస్. ఈ విద్యా సంవత్సరం భారీగా సెలవులను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు క్యాలెండర్ ఇయర్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం కాలేజీ ప్రారంభంకాగానే 55 రోజుల్లో యూనిట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
అలాగే అక్టోబర్‌లో యూనిట్-3 పరీక్షలు ముగిసిన వెంటనే దసరా హాలీడేస్ ఇస్తారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సెలవులు ఇస్తారు. అంటే విద్యార్థులు వారం రోజుల పాటు సెలవులు వస్తాయి. అలాగే సంక్రాంతికి కూడా భారీగానే సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కళాశాలలకి పండగ సెలవులు ఇస్తారు.
చదవండి: జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు రీ ఓపెన్
అప్పుడు దాదాపు ఏడు రోజులు సెలవులు రానున్నాయి. వీటికి తోడు మధ్యమధ్యలో ప్రభుత్వం ఇచ్చే సెలవులు ఎలాగూ ఉంటాయి. మార్చి 28వ తేదీ చివరి వర్కింగ్ డే కానుంది. మార్చి మొదటి వారంలో పరీక్షలు ఉంటాయి. ముందుగా ప్రకటించిన తేదీలను ఇంటర్ బోర్డు అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా మార్చే అవకాశం కూడా ఉంది.
Published date : 28 Apr 2023 07:03PM