Skip to main content

AP Inter 2024 1st And 2nd Year Results: ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

AP Inter 2024 1st And 2nd Year Results
AP Inter 2024 1st And 2nd Year Results

ఏపీలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫలితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్ విడుదల చేశారు. ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఫలితాలను విడుదల చేశారు.

బాలికలదే పైచేయి..

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా, ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 67% శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. అయితే ఈ ఫలితాల్లో బాలురితో పోలిస్తే బాలికలు పై చేయి సాధించారు. 

ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో..
ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 235,033 మంది బాలికలు హాజరుకాగా, వారిలో 167,187 మంది పాసయ్యారు. ఫలితంగా 71 శాతం ఉత్తీర్ణత సాధించారు. 226,240 మంది అబ్బాయిలు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరుకాగా, 143,688 మంది ఉత్తీర్ణత సాధించి, 64 శాతం ఉత్తీర్ణత సాధించారు.

సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో..
204,908 మంది బాలికలు సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరుకాగా,165,063 మంది పాసయ్యారు, ఫలితంగా 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. 188,849 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 141,465 పాసయ్యారు. ఫలితంగా  75 శాతం ఉత్తీర్ణత సాధించారు.
 

Published date : 12 Apr 2024 12:42PM

Photo Stories