Inter Colleges Reopen: జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు రీ ఓపెన్... ఈ ఏడాది సెలవులు ఎన్నంటే...
Sakshi Education
ఇంటర్ కళాశాలలు జూన్ 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. వేసవి సెలవుల అనంతరం కాలేజీలు యథాతథంగా ప్రారంభంకానున్నాయి. 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధికారులు క్యాలెండర్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రారంభంకానున్న విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కి 227 పనిదినాలు తరగతులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
అలాగే ఏయే తేదీల్లో పరీక్షలు నిర్వహించబోయేది కూడా ఇప్పుడే ప్రకటించింది. అందుకు సంబంధించిన తేదీలు ఇలా ఉన్నాయి.
- జులై 24 నుంచి యూనిట్-1 పరీక్షలు నిర్వహిస్తారు.
- ఆగస్ట్ 24 నుంచి యూనిట్ -2 పరీక్షలు
- సెప్టెంబర్ 16 నుంచి క్వార్టర్లీ పరీక్షలు
- చదవండి: ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు తేదీలు ఇవే
- అక్టోబర్ 16 నుంచి యూనిట్ -3 పరీక్షలు
- అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు
- నవంబర్ 23 నుంచి యూనిట్ -4 పరీక్షలు
- డిసెంబర్ 18 నుంచి హాఫ్ ఇయర్లీ పరీక్షలు
- 2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకి సెలవులు
- 2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్
- 2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు
- 2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే
చదవండి: TS Inter Exams 2023 Results : టీఎస్ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
2024 మార్చ్ 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా అధికారులు నిర్ణయించారు.
Published date : 28 Apr 2023 05:35PM