TS Inter Exams 2023 Results : టీఎస్ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 4,02,630 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్‌కు 4,82,619 మంది ఉన్నారు. ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
➤ TS EAMCET 2023 : టీఎస్ఎంసెట్- 2023 పరీక్ష తేదీలు మార్పులు.. కొత్త తేదీలు ఇవే..
మే మొదటి వారంలోనే ఫలితాలు..
పరీక్షలు ముగియడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ పై దృష్టి సారించింది. గత వారంలోనే వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వాల్యుయేషన్, టేబులేషన్ లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డ్. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే జూన్ 1వ తేదీ నుంచి తిరిగి ఇంటర్ తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS
డిజిటల్ మూల్యాంకనం ఇలా..
ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్‌లైన్‌లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు.ఇక ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
దవండి: EAMCET 2023: ఎంసెట్.. టాప్ స్కోర్ ఇలా!