Skip to main content

Intermediate Exams2024 : ఇంటర్మీడియెట్‌ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు... కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు!

ఇంటర్మీడియెట్‌ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు... కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు
Intermediate Exams2024 Strict arrangements planned for district's intermediate examinations in Machilipatnam   Joint Collector Gitanjali Sharma overseeing arrangements for intermediate exams in Chilakalapudi.
Intermediate Exams2024 : ఇంటర్మీడియెట్‌ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు........కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఇంటర్మీడియెట్‌ పరీక్షలపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు సంబంధించి ఫిబ్రవరి 22వ తేదీ నుంచి సమగ్రశిక్ష ఒకేషనల్‌ ట్రేడ్‌ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయన్నారు.

ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జనరల్‌ విద్యార్థులకు 77 పరీక్ష కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని 59 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. నిమ్మకూరు గ్రామంలోని ఏపీఆర్‌జేసీ కళాశాల మాత్రమే సెల్ఫ్‌ సెంటర్‌గా కొనసాగుతుందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్‌ఎంతో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. మాస్‌కాపీయింగ్‌ జరగకుండాచర్యలు తీసుకోవాలని జేసీ అధికారులకు సూచించారు.

Also Read : 1st Year Study Material

విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు..

పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రతి విద్యార్థికి ఇబ్బంది పెట్టకుండా హాల్‌టికెట్లు వెంటనే అందజేయాలని జేసీ సూచించారు. ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ప్రత్యేక రుసుము వసూలు చేయకూడదన్నారు. ఎవరైనా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. డీఆర్వో పెద్ది రోజా, జిల్లా ప్రజారవాణాధికారి ఎ. వాణిశ్రీ, ఆర్‌ఐవో రవికుమార్‌, డీవైఈవో యువీ సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Also Read :  2nd year Study Material

Published date : 03 Feb 2024 04:51PM

Photo Stories