Summer Holidays in India 2023 : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేసవి సెలవులు ఇలా..! మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంతే..
అలాగే అన్ని రాష్ట్రాల్లో దాదాపు వార్షిక పరీక్షలు ముగిసిన విషయం తెల్సిందే. ఇప్పటికే తెలంగాణ, ఏపీలో వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే.
టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
ఒడిశాలో ఈ సారి ఆలస్యంగానే వేసవి సెలవులు..
గతంలో ఒడిశాలో స్కూల్స్‌ను ముందుగానే.. అనగా ఏప్రిల్ 19, 20 తేదీల్లోనే మూసివేశారు. కానీ ఈ సంవత్సరం వేసవి సెలవులు మే 5 నుంచి జూన్ 18 వరకు ఉండనున్నాయి. అంటే కేవలం 44 రోజులు మాత్రమే ఇక్కడ వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఒడిశాలో పాఠశాలలు తిరిగి జూన్ 19వ తేదీ నుంచి తెరుచుకుంటాయి.
మహారాష్ట్రలో 55 రోజుల పాటు వేసవి సెలవులు..
మహారాష్ట్రలోని ప్రైమరీ, మిడిల్, హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో వేసవి సెలవులు ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమయ్యాయి. అలాగే జూన్ 15 వరకు పాఠశాలలు మూసివేయబడతాయి. అంటే 55 రోజుల పాటు స్కూల్స్‌కు సెలవులు ఇచ్చారు. ఇక్కడ పాఠశాలలు తిరిగి జూన్ 16వ తేదీ నుంచి తెరుచుకుంటాయి.
చదవండి: ఇంటర్ స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
పశ్చిమ బెంగాల్‌లో మాత్రం..
ఈ సారి ఎండలు ఒక రేంజ్‌లో దంచికొడుతున్నాయి. రోజురోజుకూ వేసవి తాపం పెరిగిపోతోంది. దీని వల్ల పశ్చిమ బెంగాల్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులు ముందుగానే ఇవ్వనున్నారు. ఇక్కడ మే 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వలని ప్లాన్ చేశారు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మే 2వ తేదీ నుంచే వేసవి సెలవులు ప్రకటించారు. అయితే ఇక్కడ పాఠశాలలు తిరిగి జూన్ మూడో వారంలో తెరుచే అవకాశం ఉంది.
☛ TS Inter Exams 2023 Results : టీఎస్ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
జార్ఖండ్‌లో మే 21 నుంచి..
జార్ఖండ్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులు మాత్రం కాస్త ఆలస్యంగానే ఇవ్వనున్నారు. ఇక్కడ స్కూల్స్‌లకు మే 21వ తేదీన నుంచి జూన్ 10వ తేదీ వరకు మాత్రం వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అంటే ఇక్కడ కేవలం 20 రోజులు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. స్కూల్స్ తిరిగి జూన్ 12వ తేదీ నుంచి తెరుచుకుంటాయి.
➤ TS EAMCET 2023 : టీఎస్ఎంసెట్- 2023 పరీక్ష తేదీలు మార్పులు.. కొత్త తేదీలు ఇవే..
మధ్యప్రదేశ్‌లో భారీగానే సెలవులు.. కానీ
మధ్యప్రదేశ్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఇక్కడ మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు వేసవి పాఠశాలకు సెలవు ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఉపాధ్యాయులకు సెలవులు మే 1 నుంచి జూన్ 9 వరకు మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ 45 రోజులు పాటు సెలవులు ఇవ్వనున్నారు. స్కూల్స్ తిరిగి జూన్ 16వ తేదీ నుంచి తెరుచుకుంటాయి.
☛ Students Holidays 2023 : ఈ విద్యార్థులకు 77 రోజులు సెలవులు.. ఎందుకంటే..?
ఉత్తర ప్రదేశ్‌లో 40 రోజులు మాత్రమే సెలవులు..
ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులు 40 రోజులు మాత్రమే ఇచ్చారు. వేసవి సెలవులు మే 21 నుంచి జూన్ 30 వరకు ఉండనున్నాయి. స్కూల్స్ తిరిగి జూలై 1వ తేదీ నుంచి తెరుచుకుంటాయి.
చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!
తెలంగాణలో మాత్రం..
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదిపాటు తరగతులు, హోంవర్క్‌లు, ట్యూషన్లు, పరీక్షలతో సతమతమైన పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఏప్రిల్ 25వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ వేసవిలో 48 రోజుల పాటు బాలలు సెలవుల్లో మునిగి తేలనున్నారు. ఒక వేళ ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కవగా ఉంటే ఈ సెలవులను పొడిగించే అవకాశం ఉంది. పాఠశాలలు.. సెలవుల అనంతరం జూన్ 12న తెరుచుకుంటాయి.
చదవండి: What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులు ఇవే..
ఎక్కువ మంది విద్యార్థులు వేసవి సెలవులు కోసం.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే విద్యార్థులకు ఎక్కవగా వచ్చే సెలవుల్లో.. వేసవి సెలవులే ఎక్కువగా ఉంటాయి. అలాగే మరో తరగతికి వెళ్లడానికి వేసవి సెలవుల తర్వాతనే అవకాశం ఉంటుంది.దీంతో ఏఏ స్టూడెంట్స్ అయినా ప్రభుత్వం ఎప్పుడు సెలవులు ప్రకటిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 2022-23 ఏపీ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 1వ తరగతి నుంచి 9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. మరో 2 రోజులు ఎగ్జామ్ రిజల్ట్స్ వెల్లడి, పేరెంట్స్ మీటింగ్స్ వంటివి ఉండనున్నాయి.
చదవండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ కొలువు
ఏప్రిల్ 30వ తేదీ నుంచి స్కూల్స్‌కు సెలవులు ఇవ్వనున్నారు. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ పున: ప్రారంభం అవ్వనున్నాయి. అంటే దాదాపు 45 రోజులు పాటు ఏపీ పాఠశాలకు సెలవులు రానున్నాయి.
శీతల ప్రాంతాల్లో వేసవి సెలవులు కాస్త తక్కువగానే ఉండన్నాయి. ఎందుకంటే.. చలికాలంలో చలి తీవ్రత బట్టి అక్కడ ఉండే స్కూల్స్ ఆ సమయంలో సెలవులు ఇవ్వనున్నారు.
☛ Telangana 10th Class Results 2023 Date : తెలంగాణ 'పదో తరగతి ఫలితాలు' విడుదల ఎప్పుడంటే..?
☛ TS 10th Class Result 2023 Date : మే 15న టెన్త్ ఫలితాలు విడుదల..?పూర్తి వివరాలు ఇవే..
దేశంలోని రాష్ట్రాల వారిగా వేసవి సెలవుల పూర్తి వివరాలు ఇవే..
Name of the State | Summer Holidays for Schools 2023 | School Reopening Date 2023 |
Andhra Pradesh | April 30 to June 12, 2023 | June 12, 2023 |
Assam | July 1 to July 31, 2023 | August 1, 2023 |
Bihar | June 1 to June16, 2023 | June 17, 2023 |
Chhattisgarh | May 8 to June 16, 2023 | June 17, 2023 |
Goa | May 1 to June 3, 2023 | June 5, 2023 |
Gujarat | May 1 to June 4, 2023 | June 5, 2023 |
Haryana | June 1 to June 30, 2023 | July 1, 2023 |
Jharkhand | May 21 to June 10, 2023 | June 12, 2023 |
Karnataka | May 11 to June 28, 2023 | June 29, 2023 |
Madhya Pradesh | May 1 to June 15, 2023 | June 16, 2023 |
Rajasthan | June 1 to June 30, 2023 | July 1, 2023 |
Odisha | May 5 to June 18, 2023 | June 19, 2023 |
Punjab | June 1 to July 31, 2023 | August 1, 2023 |
Tamil Nadu | June 1 to June 30, 2023 | July 1, 2023 |
Telangana | April 25 to June 12, 2023 | June 13, 2023 |
Uttar Pradesh | May 21 to June 30, 2023 | July 1, 2023 |
Uttarakhand | June 1 to June 30, 2023 | July 1, 2023 |
West Bengal | May 2, 2023 onwards | జూన్ మూడో వారంలో..? |
గమనిక : పై పట్టికలోని సెలవులు ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఇవ్వడం జరిగింది. పరిస్థితులను బట్టి కొన్ని రాష్ట్రాల్లో సెలవులు మారే అవకాశం ఉండోచ్చు.
చదవండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?