Students Holidays 2023 : ఈ విద్యార్థులకు 77 రోజులు సెలవులు.. ఎందుకంటే..?
మొత్తం మీద 2023–24 అకడమిక్ ఇయర్‌లో విద్యార్థులకు 77 రోజులు సెలవులను ఇచ్చింది. విద్యా సంవత్సరంలో 365 రోజులకు గాను 227 రోజుల పాటు తరగతులు జరుగుతాయని ప్రకటించింది. మిగిలిన రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు 2023–24 అకడమిక్ ఇయర్ క్యాలెండర్ను విడుడల చేసింది ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి తరగతలు ప్రారంభం అవుతాయని తెలిపింది ఇంటర్ బోర్డ్ తెలిపింది.
☛ TS Inter Exams 2023 Results : టీఎస్ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
పండగ సెలవులు ఇలా..
ఈ సెలవుల్లో అక్టోబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. జనవరి 13వ తేదీ నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. పండగులు, ఆదివారాలు, రెండో శనివారాలు, వేసవి సెలవులు ఇలా అన్ని మొత్తంగా కలిపి 77 రోజులపాటు సెలవులు ఉంటాయని పేర్కొంది.
చదవండి: ఇంటర్ స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
పరీక్షలు ఇలా..
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి జూన్ 1, 2024న తిరిగి కళాశాలు తెరుస్తారు.
➤ TS EAMCET 2023 : టీఎస్ఎంసెట్- 2023 పరీక్ష తేదీలు మార్పులు.. కొత్త తేదీలు ఇవే..
ఈ 77 రోజులకు సంబంధించిన పూర్తి సెలవుల వివరాలు ఇవే..