Skip to main content

TS 10th Class Result 2023 Date : మే 15న టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌..?పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో పదో తరగతి ప‌బ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీన నుంచి ఏప్రిల్ 11వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన విష‌యం తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ఈ ఏడాది రెగ్యుల‌ర్ విద్యార్థులు 4,86,194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
ts 10th class result 2023 in telugu news
ts 10th class result 2023 date

పదోతరగతి పరీక్షలను పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది.

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యాబోధన ప్రారంభం కానుంది. అందుకోసం, టెన్త్ ఫలితాల వెల్లడి కోసం విద్యాశాఖ త్వరపడుతోంది. ఏప్రిల్ 21 వరకు మూల్యాంకనం, ఆ తర్వాత టాబ్యులేషన్ నిర్వహించి, మే 15న ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను https://results.sakshieducation.com/లో చూడొచ్చు.

results news

మొత్తం 18 సెంటర్లలో ఈ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతుండగ.. ఏప్రిల్ 21వ తేదీ వరకు ఈ వాల్యుయేషన్ కొనసాగనుంది. అనంతరం టేబులేషన్ ప్రక్రియ మరో పది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. గతంలో మూల్యాంకన కేంద్రాలు 12 ఉంటే, ఈసారి 18కి పెంచారు. జిల్లాల వారీగా సబ్జెక్టు, లాంగ్వేజ్‌ నిపుణులను మూల్యాంకన విధులకు తీసుకున్నారు. సాధారణంగా విద్యాశాఖ అధికారులు మూల్యాంకన ప్రక్రియ మొదలవడానికి కేవలం రెండు రోజుల ముందుగా టీచర్లకు విధులు వేస్తుంటారు.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

కీల‌క‌ ఆదేశాలు..

ts 10th results news telugu

మూల్యాంకన విధులకు హాజరవని టీచర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. బలమైన కారణాలుంటే తప్ప, మెడికల్‌ సర్టిఫికెట్లను అనుమతించకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది.

☛ What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం

30 లక్షలకు పైగా సమాధాన పత్రాలను..
మొత్తంగా 30 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండగా.. వివిధ సమస్యలతో ఈ ఏడాది స్పాట్‌ వాల్యూయేషన్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది టెన్త్‌ ఫలితాల వెల్లడిపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు.

☛ Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

Published date : 18 Apr 2023 05:02PM

Photo Stories