విశ్రాంత హెచ్‌ఎంకు ప్రధాని మోదీ ప్రశంసలు
మే 29న ప్రధాని నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా రాంభూపాల్‌రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలకు సంబంధించి ఫొటోలు చూపుతూ.. వివరాలు చెబుతూ ఆయనను అభినందించారు. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీ విరమణ చేశాక వచ్చిన రూ.25 లక్షలను పేద బాలికల అభ్యున్నతి కోసం వినియోగించడం గొప్ప విషయమని ప్రధాని కొనియాడారు. రాంభూపాల్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పేదల సంక్షేమం కోసం పాటుపడాల ని కోరారు. ‘సమాజానికి సేవ చేయాలనే మంత్రం మన విలువలు, సంస్కారంలో ఒక భాగం. దేశంలో లెక్కలేనంత మంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో ఉంటున్న మిత్రుడు రాంభూపాల్‌రెడ్డి గురించి తెలుసుకున్నా. తన రిటైర్మెంట్ తర్వాత వచ్చిన సంపాదనంతా పేద బాలికల అభ్యున్నతి కోసం వెచ్చించారని తెలిస్తే ఆశ్చర్యపోతారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.కాగా,రాంభూపాల్‌రెడ్డి 35 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించి గతేడాది పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన రూ.25,71,676 యడవల్లి పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు.
చదవండి:
Latha Maraveni: ఎంతో మంది పేద పిల్లలను ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మారుస్తుంది ఈ మహిళ