Skip to main content

Education: నాణ్యత, పరిశోధనలకు పెద్దపీట

సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నత విద్యలో అత్యున్నత సంస్కరణలు ప్రవేశపెట్టామని, వాటి ఫలితాలు విద్యార్థులకు అందుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు.
Education
విద్య నాణ్యత, పరిశోధనలకు పెద్దపీట

ఆయన జనవరి 5న మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న విద్యా, వసతి దీవెనలతో చేరికలు జాతీయ సగటుకన్నా గణనీయంగా పెరిగాయని, గత రెండేళ్లలో 65 వేల మంది విద్యార్థులు అదనంగా కాలేజీల్లో చేరారని తెలిపారు. మొదటిసారిగా 4 ఏళ్ల డిగ్రీ ప్రవేశపెట్టామని, విద్యార్థులకు మలి్టపుల్ ఎగ్జిట్కు అవకాశమిచ్చామని తెలిపారు. ఇంజనీరింగ్ కరిక్యులంలో వెసులుబాట్లు కలి్పంచామని, విద్యార్థులకు ఇంటర్న్ షిప్ తప్పనిసరి చేశామన్నారు. రూ.30 కోట్లతో 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇలా పలు కార్యక్రమాల ఫలితంగా ప్లేస్మెంట్లు పెరుగుతున్నాయన్నారు. 2019 – 20లో 35 వేల మంది, 2020–21లో 55 వేల మందికి ప్లేస్మెంట్లు రాగా, 2021–22 లో 70 వేల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఈ ఏడాది లక్షకు పైగా ప్లేస్మెంట్లు వస్తాయని చెప్పారు.

క్వాలిటీ అస్యూరెన్స్, అసెస్మెంట్ సెల్స్

జాతీయ, అంతర్జాతీయ అక్రెడిటేషన్ల సాధనకు అన్ని కాలేజీల్లో నాణ్యత పరిశీలన, పర్యవేక్షణకు దేశంలోనే తొలిసారిగా క్వాలిటీ అస్యూరెన్స్, అసెస్మెంట్ సెల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, రీసెర్చ్ బోర్డులను నెలకొలి్పనట్లు చెప్పారు. విద్యార్థులను సమాజంతో మమేకం చేసేలా కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశామని, ప్రతి విద్యార్థి 2 నెలలు సమాజానికి ఉపయోగకరమైన ప్రాజెక్టు వర్కు చేసి, నివేదిక ఇస్తారని తెలిపారు. 517 ఎంటర్ప్రెన్యూర్ షిప్ ఇంక్యుబేషన్ స్టార్టప్ సెంటర్ల ద్వారా సృజనాత్మకత, పరిశోధనలు పెరుగుతాయని వివరించారు. విద్యార్థులు ఎలాంటి విద్యను కోరుకొంటున్నారో తెలుసుకోవడానికి, విద్యా సంస్థల నుంచి సమాజం ఏమి కోరుకొంటోందో తెలుసుకునేందుకు సర్వేలు చేపడుతున్నామని వివరించారు.

చదవండి: 

Higher Education: ఉన్నత విద్య కోర్సుల్లో సమ్మర్‌ స్కూల్‌ కాన్సెప్‌

Colleges: ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు

Good News: విద్యార్ధులకు నైపుణ్యాలను పెంపొందించేలా ఉచిత శిక్షణ

Published date : 06 Jan 2022 11:12AM

Photo Stories