Colleges: ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత విద్యా శాఖాధికారులకు పలు సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. పలుమార్లు గడువిచ్చినా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కాలేజీల్లో ఈ 2021 అడ్మిషన్లు నిలిపివేస్తోంది. జీరో అడ్మిషన్లు, 25 శాతం లోపు చేరికలు ఉన్న కాలేజీలకు అనుమతులు నిలిపివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే విద్యారంగంపై, ముఖ్యంగా ఉన్నత విద్యలో ప్రమాణాలపై దృష్టి సారించారు. కాలేజీల్లో ప్రమాణాల పెంపునకు ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి అధ్యయనం చేయించారు. నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సుల ఏర్పాటు, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంటర్న్షిప్, కాలేజీలకు న్యాక్, ఎన్ బీఏ గుర్తింపు పొందేలా చర్యలు, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు.. ఇలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు ఫీజులను పూర్తిస్థాయిలో రీయింబర్స్ చేయడమే కాకుండా వారికి వసతి, భోజనాల కోసం రూ.20 వేల వరకు ఏటా చెల్లిస్తున్నారు. ఇన్ని చేస్తున్నందున లక్ష్యాలకు అనుగుణంగా కాలేజీల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలకు ఉన్నత విద్యా మండలి చేపట్టింది. 337 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో 91 ఇంజనీరింగ్, 21 ఫార్మా కాలేజీలు కాకినాడ జేఎన్ టీయూకు కోట్ల రూపాయల రుసుములు బకాయి ఉన్నాయి. ఈ కాలేజీలకు ఈ ఏడాది పూర్తిగా అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది వీటికి కొన్ని షరతలతో అడ్మిషన్లు నిర్వహంచారు. ఈసారి మాత్రం నవంబరు 1వ తేదీ లోపు బకాయిలు చెల్లిస్తేనే అనుమతిస్తామని స్పష్టంచేసింది. కొన్నేళ్లుగా చేరికలు తగ్గుతూ ఒక్క విద్యార్థి కూడా చేరని కాలేజీలు అనంతపురం జేఎన్ టీయూ పరిధిలో 28, కాకినాడ జేఎన్ టీయూ పరిధిలో 22 ఉన్నాయి. వీటికి కూడా ప్రవేశాలు నిలిపివేయనున్నారు. ఇక యూనివర్సిటీల గుర్తింపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 40 ప్రైవేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిలిపివేసింది. 257 కాలేజీల్లో విద్యార్థుల చేరికలు లేని 454 ప్రోగ్రాముల్లో కూడా అడ్మిషన్లు నిలిపివేస్తున్నారు.
డిగ్రీ కోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే
విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులన్నింటినీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా అందించే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానుంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్థానిక మాతృభాషల్లోనే బోధిస్తున్నారు.
యూనివర్సిటీల వారీగా అడ్మిషన్లు నిలిపివేసిన కాలేజీల సంఖ్య
వర్సిటీలు |
కాలేజీలు |
ఆంధ్రాయూనివర్సిటీ |
06 |
ఆచార్య నాగార్జున వర్సిటీ |
08 |
ఆదికవి నన్నయ వర్సిటీ |
05 |
యోగివేమన వర్సిటీ |
05 |
కృష్ణా వర్సిటీ |
13 |
రాయలసీమ వర్సిటీ |
03 |
విక్రమసింహపురి వర్సిటీ |
01 |
మొత్తం |
41 |
257 కాలేజీల్లోని అడ్మిషన్లు నిలిపివేసిన ప్రోగ్రాములు..
వర్సిటీలు |
కాలేజీలు |
ప్రోగ్రాములు |
ఆంధ్రాయూనివర్సిటీ |
40 |
62 |
శ్రీవెంకటేశ్వర వర్సిటీ |
30 |
58 |
ఆచార్య నాగార్జున వర్సిటీ |
29 |
42 |
శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ |
15 |
34 |
ఆదికవి నన్నయ వర్సిటీ |
42 |
54 |
యోగివేమన వర్సిటీ |
15 |
24 |
బీఆర్ అంబేద్కర్‌వర్సిటీ |
16 |
29 |
కృష్ణా వర్సిటీ |
30 |
58 |
రాయలసీమ వర్సిటీ |
22 |
54 |
విక్రమసింహపురి వర్సిటీ |
18 |
39 |
మొత్తం |
257 |
454 |
అత్యున్నత ప్రమాణాల విద్యనందించడమే సీఎం లక్ష్యం
అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. కాలేజీలకు కొంత సమయం ఇచ్చి ప్రమాణాలు మెరుగుపర్చుకోకుంటే చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాలేజీ ఎవరిదైనా సరే ప్రమాణాలు లేకపోతే అనుమతించవద్దని సూచించారు. అలాంటి కాలేజీల వల్ల విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండాపోతాయి. అలాంటి వాటికి చోటుండకూడదని సీఎం ఆదేశం. అందుకే ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు చేపడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటిని అనుమతించం.
– ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలిచైర్మన్
చదవండి:
రెక్కలు లేకపోతేనేం... తండ్రి చేతుల్లో వాలిన సీతాకోక చిలుకలా ఉన్నాడు పిల్లాడు
Counseling: ఎంపీసీ స్ట్రీమ్ కోర్సులకు కౌన్సెలింగ్ తేదీ ఇదే..