Skip to main content

రెక్కలు లేకపోతేనేం... తండ్రి చేతుల్లో వాలిన సీతాకోక చిలుకలా ఉన్నాడు పిల్లాడు

గాయాలను ఆహ్వానించగలిగినవాళ్లే... గేయాలను రచించగలరంటాడో కవి ఎన్నో గాయాల దుఃఖాల నుంచే కదా.. అసలైన నవ్వుల విలువ తెలుస్తుంది ఆ గాయాలన్నీ మరిచి చిద్విలాసాలను చిందించడానికి ఎంతటి సహృదయత కావాలి .
Munjiir
రెక్కలు లేకపోతేనేం... తండ్రి చేతుల్లో వాలిన సీతాకోక చిలుకలా ఉన్నాడు పిల్లాడు మచ్చలుంటేనేం... చందమామ చేతికందినంత సంతోషంగా ఉంది తండ్రి ముఖం

నిత్య యుద్ధనేల సిరియాలో జరిగిన ఓ బాంబుదాడిలో కాలును కోల్పోయాడు మున్జీర్‌. యుద్ధంలో వెలువడిన నెర్వ్‌ గ్యాస్‌ని పీల్చుకున్నందుకు కాళ్లు, చేతులు లేని కొడుకు ముస్తఫాకి జన్మనిచ్చింది తల్లి జీనెప్‌. సిరియాలో యుద్ధం తీసుకెళ్లిపోయిన తమ సంతోషాన్ని వెతుక్కుంటూ సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో స్థిరపడిందా కుటుంబం. ఓ ఆహ్లాద సమయాన ఆ తండ్రీకొడుకుల నవ్వులను క్లిక్‌మనిపించాడు టర్కిష్‌ ఫొటోగ్రాఫర్‌ మెహ్మత్‌ అస్లన్. సియెనా ఇంటర్నేషనల్‌ ఫొటో అవార్డ్స్‌ –2021లో ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. ‘సిరియాలో ఏం జరుగుతుందో ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి చూపాలనుకున్నాను’అని చెప్పాడు అస్లన్. 

Published date : 27 Oct 2021 04:24PM

Photo Stories