Skip to main content

Higher Education: ఉన్నత విద్య కోర్సుల్లో సమ్మర్‌ స్కూల్‌ కాన్సెప్‌

రాష్ట్రంలోని ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులతో సమ్మర్‌ స్కూల్‌ కాన్సెప్ట్‌ వంటి ఉత్తమ అభ్యసన ప్రక్రియలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు.
Higher Education
ఉన్నత విద్య కోర్సుల్లో సమ్మర్‌ స్కూల్‌ కాన్సెప్‌

పరిశ్రమలు, ఇతర సంస్థలతో కాలేజీలకు అనుసంధానం ఏర్పాటు చేయడం ద్వారా సమగ్రమైన విజ్ఞానం విద్యార్థుల్లో నెలకొనేలా చర్యలు చేపట్టామని వివరించారు. నవంబర్‌ 5న వర్చువల్‌ విధానంలో ‘జర్మన్ –ఏపీ ఫోరం ఆన్ హయ్యర్‌ ఎడ్యుకేషన్’ ఆధ్వర్యంలో ‘ఇంజనీరింగ్‌ అంటే ఏమిటి? సైన్స్, ఇంజనీరింగ్‌ మధ్య తేడా ఏమిటి?’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జర్మనీ వర్సిటీ అడ్వాన్స్ డ్‌ స్టడీస్, ఉన్నత విద్యామండలి భాగస్వామ్యంతో ఇండియా, జర్మనీల మధ్య ఉన్నత విద్యలో పరస్పర సహకారంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ సమ్మర్‌ స్కూల్‌ కాన్సెప్ట్‌లో వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రాజెక్టు వర్కులు, ఇంటర్న్‌షిప్‌లను అమలు చేయిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జర్మనీ భాగస్వామ్యంతో అత్యుత్తమ ప్రక్రియలను అనుసరించడం ద్వారా రాష్ట్ర విద్యార్థులు మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్మన్ వర్సిటీ ఫర్‌ అడ్వాన్స్ డ్‌ స్టడీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ వి.వి.ఎన్.రాజు, జేఎన్ టీయూ అనంతపురం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.రంగజనార్దన స్టయిన్ బీస్‌ వర్సిటీకి చెందిన బెర్‌ట్రామ్‌ లోహ్ముల్లర్‌ మాట్లాడారు.

చదవండి: 

Jobs: సీపీసీహెచ్‌ లేకున్నా.. పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. నేడే చివరి తేదీ

AP EAPCET 2021: ఇవాళ ఒక్కరోజే విద్యార్థులకు అవకాశం

EWS: ఈడబ్ల్యూఎస్‌ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!

Published date : 06 Nov 2021 11:42AM

Photo Stories