Teacher Tool Coaching : టీచర్ టూల్ శిక్షణతో విద్యాభివృద్ధికి దోహదపడాలి..
కశింకోట: విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై ఉన్న వెనుకబాటుతనాన్ని తగ్గించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఉపాధ్యాయులను కోరారు. కశింకోటలోని డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అబ్జర్వర్ టీచర్లకు నిర్వహిస్తున్న టీచర్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ తీరును గమనించి, ఎంత మేరకు ఆకళింపు చేసుకుంటున్నారనే విషయంపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 9 రోజులపాటు జరిగే శిక్షణ పూర్తయిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న అంశాలతో పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన సాగించి విద్యాభివృద్ధికి దోహదపడాలని సూచించారు.
Job Mela : రేపు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా.. ఈ వయసు గలవారు అర్హులు..!
బోధనలో బోధనాభ్యసన సామగ్రిని విరివిగా వినియోగించాలన్నారు. రాష్ట్ర పరిశీలకురాలు డీఆర్ భాగ్యశ్రీ కూడా శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏఎంవో ఎంఎం పట్నాయక్, కోర్సు డైరెక్టర్ డీఆర్ పాఠశాల హెచ్‌ఎం ఎంఆర్‌వీ అప్పారావు, ఎంఈవో–2 మూర్తి, ఏపీవో వెంకటేశ్వరరావు, మాస్టర్ ట్రైనీలు నారాయణరావు, అచ్యుత కృష్ణ, నూకేష్, ఫణీంద్రకుమార్, వేణుగోపాల్, శ్రీరామమూర్తి, ఉపాధ్యాయులు ఆనంద్, అప్పారావు, రవి పాల్గొన్నారు.
IGNOU Admissions : ఇగ్నోలో ప్రవేశానికి దరఖాస్తుల తేదీ పొడగింపు.. ఎప్పుడు?